»   » ప్రేమిస్తా... సమాజానికి భయపడను: త్రిష

ప్రేమిస్తా... సమాజానికి భయపడను: త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ త్రిష-నిర్మాత వరుణ్ మనియన్ ప్రేమబంధం ఎంగేజ్మెంట్ వరకు వెళ్లి రద్దయిన సంగతి తెలిసిందే. ఏమైందో తెలియదు కానీ ఇద్దరికీ బ్రేకప్ అయింది. ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రేకప్ తర్వాత తన జీవితం, ఫ్యూచర్ ప్లాన్ష్ గురించి వెల్లడించింది.

బ్రేకప్ తర్వాత నేనేమీ బాధ పడటం లేదు, చాలా సంతోషంగా ఉన్నాను...ప్రస్తుతం కెరీర్ మీదనే దృష్టి పెట్టాను అని త్రిష చెబుతోంది. జీవితంలో చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయని త్రిష వెల్లడించింది. 32 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి కాలేదని సోషల్‌గా మీపై ప్రెషర్ ఉందా? అనే ప్రశ్నకు త్రిష తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది.

Trisha Says She Will Get Married Under One Condition!

వివాహ వ్యవస్థపై నాకు గౌరవం ఉంది. త్వరలోనే ఎవరో ఒకరిని ప్రేమించి పెళ్లాడతాను. ఈ సమాజానికి భయపడి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను' అని త్రిష తేల్చి చెప్పింది. నాకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు వెయిట్ చేస్తాను అని స్పష్టం చేసింది.

ప్రస్తుతం త్రిష సౌత్ లో పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగు సినిమాలతో పాటు తమిళంలో జయం రవితో భూలోహం, అప్ప టక్కరు చిత్రాల్లో నటిస్తోంది.

English summary
In an interesting interview to a leading daily, actress Trisha has opened up about her life post break up and her future plans including marriage and more. The actress who was quick to sweep her broken engagement under the carpet is apparently living life to the fullest by concentrating on her career and other important aspects of life.
Please Wait while comments are loading...