సముద్రంలో త్రిష స్కూబా డైవింగ్ (హాట్ ఫోటోలు)
హైదరాబాద్ : తాను జలచరాలతో కలసి ఈత కొట్టాలనే తన చిరకాల కోరిక తీరిందని త్రిష మురిసిపోతోంది. రీసెంట్ గా విదేశాలకు విహారయాత్రకు వెళ్లిన త్రిష అక్కడ స్కూబా డైవింగ్ చేసింది. ఆ సముద్ర గర్భంలో తనకు కలిగిన విచిత్రమైన అనుభూతిని వర్ణించటానికి మాటలు చాలవంటోంది.
ఆమె ఈ విషయమై ట్వీట్ చేస్తూ.....చుట్టూ గాఢాంధకారం అలుముకున్న చీరటి, పూర్తి నిశ్శబ్దం, విపరీతమైన లోతులో మన ప్రక్కకనే పరుగెత్తే విచిత్రమైన చేపలు, ఆక్టోపస్, రొయ్యలు, పెద్ద పెద్ద పీతలు, లెమన్ షార్క్ లు, డాల్ఫిన్స్..ఎటు చూసినా సముద్రమే..నీళ్లే.. ఓహ్..వర్ణించటానికి నా మాటలు చాలవంట లేదు.. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది అంటోంది.
ఈ బ్యూటీ తాజాగా నటిస్తున్న ద్విభాషా చిత్రం రమ్. ఇందులో త్రిష యాక్షన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రం కోసం చిత్రీకరించిన కారు రేస్ సన్నివేశంలో రిస్క్ తీసుకుని ఫైట్ చేసిందట త్రిష. దర్శక నిర్మాతలు డూపుతో చిత్రీకరిద్దామన్నా వద్దని వారించి మరీ ఈ ముద్దుగుమ్మ రిస్కీ ఫైట్ కోసం సాహసం చేసిందట.
త్రిష స్కూబా డైవింగ్ ఫోటోలు స్లైడ్ షో లో మీకోసం...

సాధారణంగా రీల్‌లో రియల్ ఫైట్స్ చేయడానికి కొద్ది మంది హీరోలే సాహసం చేస్తుంటారు. ఇక హీరోయిన్లు ఫైట్స్ చేయడం అరుదు. కానీ త్రిష తనకు సాహసాలంటే ఇష్టం..అటువంటి ఫైట్స్ ముందుంటాను అంటోంది.

త్రిష రమ్ చిత్రంలో డూప్ లేకుండా రిస్కీ ఫైట్ చేసి యూనిట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది

ఈ విషయం గురించి త్రిష తెలుపుతూ ఇలాంటి సాహసాలు చేస్తున్నప్పుడు హీరోలు ఎంత రిస్క్ తీసుకుంటున్నారో అర్థం అవుతుందన్నారు.

త్రిషలో గొప్పతనం ఏమిటీ అంటే గత పదేళ్లుగా ఒకే తరహా ఫిగర్ ని మెయింటైన్ చెయ్యటం.

రమ్ చిత్రాన్ని ఎమ్.ఎస్ రాజు డైరక్ట్ చేస్తున్నారు. పూర్తిగా ఉమెన్ సెంట్రిక్ గా కథ నడుస్తుంది.


Click it and Unblock the Notifications











