నచ్చిన మగాడు దొరకాలే గానీ.. అక్కడే జరిగిపోవాలి.. మ్యారేజ్ సీక్రెట్ చెప్పేసిన త్రిష
సౌత్ సినీ ఇండస్ట్రీని గత 18 ఏళ్లుగా ఏలుతూ వస్తోంది అందాల తార త్రిష. తెలుగు, తమిళ భాషల్లోని అందరు అగ్రహీరోలతో రొమాన్స్ చేసి స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ కూడగట్టుకుంది ఈ ఈ చెన్నై సుందరి. కెరీర్‌లో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న ఈ మధ్యకాలంలో కాస్త స్లో అయింది. దీంతో ఇక ఈమె పెళ్లి చేసుకుంటుందేమో అనే టాక్ బయటకొచ్చింది. ఈ నేపథ్యంలో తన మ్యారేజ్ సీక్రెట్స్ చెబుతూ ఆసక్తికరంగా స్పందించింది త్రిష.

సోషల్ మీడియా యాక్టివ్.. అక్కడ కూడా టాలెంట్
సినిమాల పరంగా నెమ్మదించినప్పటికీ.. నేటి కాలానికి తగ్గట్టుగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటోంది త్రిష. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను రెట్టింపు చేసుకుంటోంది. సీనియర్ హీరోయిన్‌గా ఆన్ లైన్ వేదికలపై కూడా టాలెంట్ చూపిస్తోంది. ఇందులో భాగంగా కాసేపు అభిమానులతో చాట్ చేసింది త్రిష.

నచ్చిన మగాడే గనక దొరికితే.. అక్కడే
ఈ సోషల్ మీడియా చాట్‌లో భాగంగా త్రిష తన పెళ్లి గురించి స్పందించింది. 'మీరు వివాహ వ్యవస్థను నమ్ముతారా?' అని ఓ నెటిజన్ వేసిన ప్రశ్నపై రియాక్ట్ అవుతూ వివాహ వ్యవస్థపై తనకు పెద్దగా నమ్మకం లేదని చెప్పింది. అలాగే ఒకవేళ నచ్చిన మగాడే గనక దొరికితే లాస్‌వేగాస్‌లోనే పెళ్లి చేసుకుంటా అని తెలిపింది. వివాహ వ్యవస్థపై నమ్మకం లేదంటూనే ఇలా వేగాస్‌లో పెళ్లి చేసుకోవాలనుందని చెప్పడం ఆమె చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

చెన్నై బ్యూటీ జోష్.. సినిమాలు
ఇప్పటికీ చెన్నై బ్యూటీకి వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్'లో నటిస్తున్న ఆమె.. చిరంజీవి 152వ చిత్రంలోనూ అలాగే మోహన్‌లాల్‌తో ‘రామ్' సినిమాలోనూ నటిస్తోంది. ఇవిగాక మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.
Recommended Video

మెగా 152.. త్రిష హంగామా
చిరంజీవి 152వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో త్రిషను కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన మరింత గ్లామర్‌గా కనిపించనుందట త్రిష. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.


Click it and Unblock the Notifications











