హాట్ హీరోయిన్ త్రిషతో జత కట్టాలని చాలా మంది హీరోలకు ఉంటుంది. అయితే డేట్స్ ఖాళీ లేకో,ఆమె చెప్పే రెమ్యునేషన్ ఎక్కువనో అవి ముందుకెళ్ళవు. అయితే తాజాగా గోపీచంద్ ఆమె ప్రక్కన చేసే అవకాశం సంపాదించుకున్నాడు. తొలిసారిగా ఈ కాంబినేషన్ ని సెట్ చేసిన ఘనత శౌర్యం దర్శకుడు శివకు దక్కుతుంది. ఆయన దర్శకత్వంలోనే గోపీచంద్ మరో సినిమా చేస్తున్నాడు. ఇక 'కింగ్' తరవాత త్రిష ఒప్పుకొన్న తెలుగు చిత్రమిదే. పుల్లారావు, భగవాన్ నిర్మాతలుగా రూపొందనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట కాజల్ పేరుని పరిశీలించారు. అయితే రకరకాల కారణాలవల్ల అది మెటీరియలైజ్ కాలేదు. ఇక ఈ సినిమా వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రంలో హీరో గోపీచంద్ తండ్రిగా ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ కనిపించనున్నారు. ఈయన ఇరవై మూడేళ్ల తరవాత నటిస్తున్న తెలుగు చిత్రమిదే. ఇక తొలిసారి త్రిష,గోపీచంద్ కలిసి నటించటంతో భారీగా అంచనాలు ఉన్నాయి.