వాటికోసం రూ. 25 లక్షలు ఖర్చుపెట్టిన త్రిష!
రూ. 25 లక్షలకు మధ్య తరగతి కుటుంబం మంచి ఇల్లు కట్టుకోవచ్చు. కానీ హీరోయిన్ త్రిష కేవలం తన ఇంటి లోపల అందమైన మెట్లు(staircase) కట్టించుకోవడం కోసం ఏకంగా పాతిక లక్షలు ఖర్చు పెట్టేసిందట. ఇటీవలే త్రిష తన అభిరుచికి తగ్గట్టుగా కొత్ల ఇల్లు కట్టించుకుంది. ఇంటీరియర్ డెకరేషన్ అదిరిపోయేలా తీర్చిదిద్దుకుంది. రాజమహల్‌లో మాదిరి అందమైన మెట్లు ఉంటే మరింత బాగుంటుందని భావించి ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా తన టేస్టుకు తగిన విధంగా మెట్లను కట్టించుకుంది.
నాకు ఇంట్లో తప్ప ఎక్కడికెళ్లినా ప్రశాంతత ఉండదు. ఇంటికి రాగానే స్ట్రెస్ అంతా మాయమౌతుంది. ఇంట్లో మంచి అట్మాస్మియర్ ఉంటే మనసు ఉల్లాసంగా ఉంటుంది. అందుకే నా కొత్త ఇల్లు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని నా టేస్టుకు తగిన విధంగా అన్నీ చేయించాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అంటూ పేర్కొంది త్రిష.
త్రిష సినిమాల విషయానికొస్తే...ఆమె తెలుగులో చివరగా నటించిన 'దమ్ము' చిత్రం అనుకున్న అంచనాలను చేరుకోక పోవడంతో అమ్మడు మళ్లీ కాస్త వెనకబడిపోయింది. ప్రస్తుతం ఆమె మూడు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. విశాల్ సరసన 'సమర్' చిత్రంతో పాటు...జయంరవి సరసన 'భూలోగం' చిత్రంలో, హీరో జీవాతో కలిసి 'ఎండ్రెండ్రుమ్ పున్నాగయ్' చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











