శ్రియ వచ్చేసింది...త్రిష కూడా వచ్చేస్తుందట...!?
టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుని ఇంక ఇక్కడ చాలులే అని మొత్తం సర్థుకుని మరీ బాలీవుడ్ కి వెళ్లిపోయి ఇటువైపు ముఖం కూడా చూపించని అందాల భామ త్రిష మళ్లీ తిరుగు టపా కట్టే సమయం ఆసన్నమైంది. శ్రియ తర్వాత మళ్లీ టాలీవుడ్ కి వచ్చేస్తున్న భామలలో తర్వాత పేరు త్రిషదే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన త్రిష తెలుగు చిత్రాలు చేయనని చెప్పలేదు..మంచి సినిమా వస్తే తప్పకుండా చేస్తాను..అంటూ మాటలు చెప్పడమే ఇందుకు ఉదాహరణ. ఉదహరణ కాదు..అమ్మడు అక్కడ లెగ్ పెట్టిన వేళా విశేషం బాగోలేదని అక్షయ్ కుమార్ తో నటించిన కట్టామీట్టా తొసి సినిమా రిజల్ట్ తేల్చడంతో..మంచి పేరు తెచ్చిపెట్టిన టాలీవుడ్ చాలా బెటర్ అంటుంది.
అన్నట్టు శ్రియ, త్రిష మంచి స్నేహితులు కావడం..రీసెంట్ గా డాన్ శీను సూపర్ హిట్ అవ్వడంతో శ్రియకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని భావించడం చూసిన త్రిష కూడా అర్జెంట్ గా ఓ తెలుగు సినిమా చేయాలని తెగ ప్రయత్నిస్తుందట. రెడీ..అనాలే గానీ మన దర్శకులు లైన్ లో ఉన్నారనే విషయం త్రిష ఈ పాటికే గమనించి ఉంటుందిలే..


Click it and Unblock the Notifications











