ఆకాశమంత చిత్రం త్రిషకు ఆ ఆఫర్ ఇప్పించింది
మొత్తానికి ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న త్రిష కల నెరవేరింది. ఆమె బాలీవుడ్ ప్రాజెక్టు కట్టామీటా చిత్రం పూనెలో ప్రారంభమైంది. ఆమెను 'లేసా..లేసా' సినిమా ద్వారా తమిళతెరకు పరిచయం చేసిన ప్రియదర్శన్ మళ్లీ పూనుకుని హిందీకి పరిచయం చేయడం పట్ల త్రిష ఆనందానంగా ఉంది. ఇక ఈ చిత్రం ఓకే కావటానికి అక్షయ్ కుమార్ గ్రీన్ సిగ్నల్ కావాల్సి వచ్చింది. ఆయనే ఈ చిత్రం హీరో. అక్షయ్ వరసగా త్రిష నటించిన సినిమాలన్నీ చూసాడు. అందులో 'ఆకాశమంత' ఒకటి. ఈ సినిమాలో త్రిష నటన అక్షయకుమార్ ని ఎంతో ఇన్‌స్పైర్ చేసిందిట.నిజానికి ఆకాశమంత సినిమా ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. తమిళంలో ఫరవాలేదనిపించుకున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ..తనకు ప్రకాష్ రాజ్ తో ఉన్న మొహమాటం కొద్దీ కొని చేతులు కాల్చుకున్నారు.
దాంతో ప్రియదర్శన్ కరెక్ట అమ్మాయినే చూపించారు అనుకొని త్రిషకు గ్రీన్ సిగల్ ఇచ్చారు. ఇక ఈ షూటింగ్ కి అటెండయ్యేటప్పుడు త్రిష తన అమ్మమ్మ,అమ్మ ఆశ్విర్వాదాలు తీసుకుని బయిలుదేరింది. అలాగే ఈ చిత్రం షూటింగ్ జరిగినంతసేపు ప్రెస్ ని కలవనని చెప్తోంది. అది ప్రియదర్శన్ రూల్ అని అంటోంది. ఇక ఈ చిత్రంతో బాలీవుడ్ లో పాగా వేసి అక్కడ తిష్టవేసిన తన కాంపిటేటర్ అసిన్ ని పడగొట్టాలనుకుంటోందని వినికిడి. ఇక త్రిష నటించిన శంఖం చిత్రం భాక్సా ఫీస్ వద్ద బావురుమంది. తాజాగా శ్రీనువైట్ల కాంబినేషన్ లో చేస్తున్న నమో వెంకటేశ ఆమెను మళ్ళీ యధాస్ధానానికి తెస్తుందని భావిస్తోంది.అంతేగాక ఈమె ఎన్టీఆర్ ప్రక్కన కూడా సెలక్టయింది. బాలీవుడ్ కి వెళ్తున్న ఈ సందర్భాన ఆమెకు బెస్టాఫ్ లక్.


Click it and Unblock the Notifications











