నిశ్చితార్థం నిజమే: కాబోయే వాడితో త్రిష ఎంజాయ్ (ఫోటోస్)
హైదరాబాద్: హీరోయిన్ త్రిష నిశ్చితార్థం జరిగినట్లు ఆ మధ్య వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్త, తమిళ నిర్మాత వరుణ్ మణియన్‌ను ఆమె పెళ్లి చేసుకోబోతుందని, ఆయనతో నిశ్చితార్థం కూడా ముగిసిందని కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి.
అయితే ఆ మధ్య ఈ వార్తలను త్రిషతో పాటు ఆమె తల్లి ఖండించే ప్రయత్నేం చేసారు. అయితే ఇలాంటి విషయాలు ఎంత దాచినా దాగవు అనేది వాస్తవం. విషయం నిర్మాతలకు తెలియడంతో త్రిష వచ్చే సినిమా ఆఫర్లు ఆగి పోయాయి. ఎలాగూ విషయం బయటకు పొక్కింది కాబట్టి త్రిష కూడా ఈ విషయంలో ఓపెన్ అయింది.
తనకు కాబోయే వాడు వరుణ్ మణియన్, తన స్నేహితులతో కలిసి ఉత్తరాది యాత్రకు వెళ్లిన ఫోటోలు తన సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసింది. కాబోయే భార్య, ఆమె స్నేహితులను వరుణ్ మణియన్ లక్షలు ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లడం గమనార్హం. అంతా కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ తో పాటు ఢిల్లీలోని మరికొన్ని ప్రదేశాలు సందర్శించారు. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

త్రిష అండ్ గ్యాంగ్
త్రిష అండ్ గ్యాంగ్ కలిసి ఇలా ప్రత్యేక విమానంలో ఆగ్రా, ఢిల్లీకి చేరుకున్నారు.

తాజ్ మహల్
ప్రేమలో మునిగి తేలుతున్న త్రిష...ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ వద్ద ఇలా సందడి చేసింది.

స్నేహితులతో ఖుషీగా
తన స్నేహితులతో కలిసి త్రిష తాజ్ మహల్ వద్ద ఖుషీగా గడిపింది అనడానికి ఈ ఫోటేయే నిదర్శనం.

దర్గా వద్ద...
దర్గా వద్ద త్రిష ఇలా. తొలిసారి దర్గా వచ్చానని త్రిష పేర్కొంది. దేవుడు అంతటా ఉందని తన ట్విట్టర్లో పేర్కొంది.

స్నేహితులతో దర్గాలో..
త్రిష, ఆమె స్నేహితులంతా కలిసి ఇలా దర్గాలో.....


Click it and Unblock the Notifications











