ఎన్టీఆర్ కంటే మహేష్ చాలా... అంటూ త్రిష
ఎన్టీఆర్ కంటే మహేష్ వయసులో చాలా పెద్దవాడు.అలాంటప్పుడు తనకు వదినగా ఎందుకు నటిస్తాను.ఆ పరిస్థితే వస్తే నటించడమే మానుకుంటా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది త్రిష.ఆమెపై రీసెంట్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చిత్రంలో మహేష్ కు వదిన గా చేస్తోందంటూ వార్తలు వచ్చాయి.ఈ విషయాన్ని ప్రస్దావిస్తూ ఆమె మీడియావద్ద ఇలా స్పందించింది.అలాగే...''వెంకీసార్, మహేష్ కలిసి నటించడం నిజంగా గ్రేట్ ఎచీవ్‌మెంట్. కానీ ఆ సినిమాలో నేను వెంకీసార్‌కి జోడీగా నటిస్తున్నానని, మహేష్‌కి వదినగా కనిపించనున్నానని ఇటీవల ఓ వార్త వినిపించింది. ఆ వార్త వినడానికే చాలా ఇబ్బంది అనిపించింది. వెంకీసార్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తా. కానీ మహేష్‌కి వదిన అంటే అది నిజంగా నాకు ఆత్మహత్యతో సమానమే.మా ఇద్దరిది క్యూట్ పెయిర్. ఇప్పటికీ 'అతడు"లోని మా పెయిర్ గురించి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు.
అలాగే ప్రస్తుతం ఎన్టీఆర్‌తో 'దమ్ము"లో చేస్తున్నాను అంది. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరక్ట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు, వెంకటేష్ అన్నదమ్ములుగా కనిపించనున్నారు. మహేష్ సరసన ఇప్పటికే సమంతను ఎంపిక చేసారు. ఇక వెంకటేష్ సరసన భూమిక చేసే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏదీ ఫైనలైజ్ కాలేదు.అలాగే వెంకటేష్ తో త్రిష చేసిన బాడీగార్డు చిత్రం త్వరలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











