For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాగా బుద్ది వచ్చిందంటోన్న త్రిష

    By Srikanya
    |

    బాలీవుడ్ లో సినిమా అనగానే హీరోయిన్స్ అంతా ఇక్కడ సినిమాలు వదిలేసుకుని, నేషనల్ మార్కెట్ అంటూ పరుగెడుతున్న సంగతి తెలిసింది. అయితే వీరందరికన్నా ఓ అడుగుముందే ఉన్న హీరోయిన్ త్రిష. ఆమె కట్టా మీటా చిత్రంతో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ వంటి స్టార్ సరసన ఎంట్రీ ఇచ్చి బొక్క బోర్లా పడింది. దాంతో ఆమె బాలీవుడ్ ఛాన్స్ కన్నా సౌత్ సినిమానే బెస్ట్ అని రియలైజ్ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రస్దావిస్తూ... ''బాలీవుడ్‌లో హిట్ కొట్టడమంతే అంత తేలికైన విషయం కాదు. సౌత్ లో సినిమాలన్నీ వదులుకొని ఎప్పుడు ఏ ఆఫర్ వస్తుందో అని అక్కడ వెయిట్ చేస్తూ కూర్చోవాలి.

    ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను సాహసం చేయలేను. ఎవరు చేసినా అనవసరమే.ఇక్కడా అక్కడా రెండు చోట్లా అవకాశాలు లేకుండా పోతాయి. ఎంతో అద్బుతమైన ఆఫర్ అనిపిస్తే కానీ అక్కడికి వెళ్ళకూడదు అంది. ఇక సౌత్ విషయానికి వస్తే... ఇక్కడ హిట్లతో పనిలేదు. ఆఫర్స్ పట్టుకోలగలిగితే చాలు. అయినా బాలీవుడ్ లో హీరోయిన్స్ కు లోటు లేదు. పోటీ విపరీతం అంది.ప్రస్తుతం త్రిష.. వెంకటేష్ సరసన బాడీగార్డు రీమేక్ లో చేస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.

    English summary
    Trisha Krishnan who is presently acting in Venkatesh’s Bodyguard had went firm against rumors and condemned the gossips that are spread by media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X