'తీన్ మార్' చిత్రం గురించేనా త్రిష 'చేదు ఫలితం' అంటూ కామెంట్?
ఓ సినిమా ఒప్పుకొన్నప్పుడు అనేక విషయాలు ఆలోచించినా.... ఎక్కడో తప్పు జరుగుతుంటుంది. ఎవరూ కావాలని పరాజయాలను కోరుకోరు కదా..అంటూ త్రిష నిట్టూరుస్తూ రీసెంట్ గా కామెంట్ చేసింది. ఏ సినిమా గురించి అని చెప్పకుండా ఆమె చేసిన ఈ కామెంట్ ని సినీ జనం రకరకాలుగా అర్దం చేసుకుంటున్నారు. ముంబై జనం అయితే కట్టా మీటా ప్లాప్ గురించి అనుకుంటే...ఇక్కడి వారు మాత్రం పవన్ కళ్యాణ్ తో చేసిన తీన్ మార్ సరిగ్గా ఆడకపోవటంపై ఆమె ఇలా స్పందించింది అంటున్నారు.అలాగే ఆమె..నేనెప్పుడూ కలల్లో జీవించను. వాస్తవంలోనే ఉంటాను. అయితే కొన్ని నిర్ణయాలు చేదు ఫలితాలను ఇస్తున్నాయి అంది. ప్రస్తుతం త్రిష తెలుగులో వెంకటేష్ సరసన బాడీగార్డ్ రీమేక్ లో చేస్తోంది.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











