twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటోంది

    By Srikanya
    |

    ''వెంకటేష్‌ని ఈ సినిమాలో ఓ రేంజ్‌లో ఆడుకుంటాను. అది ఏంటో మీరు తెరపైనే చూడాలి. మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు తీయనైన అనుభూతినిస్తాయి'' అంటోంది త్రిష. తన తాజా చిత్రం 'బాడీగార్డ్'త్వరలో విడుదల కాబోతున్న సందర్భంగా ఆమె అలా వ్యాఖ్యానించింది. అలాగే తన పాత్ర గురించి మాట్లాడుతూ ... ''బాడీగార్డ్‌లో నేను చేసిన పాత్ర నాకొక ఛాలెంజ్. నా ఫేవరెట్ హీరోయిన్ కరీనాకపూర్. ఆమె అద్భుతం అనిపించే లెవల్లో చేసిన పాత్ర అది. అందుకే కరీనా అంత కాకపోయినా... నా స్థాయిలో ఆ పాత్రను మెప్పించడానికి ట్రై చేశాను. సరికొత్త బాడీలాంగ్వేజ్, వెరైటీ స్టయిలింగ్ నా పాత్రకు వెయిట్ పెంచాయని చెప్పాలి'' అన్నది.

    ఈ సినిమా ద్వారా తనకు మంచి ఫ్రెండ్ దొరికిందని, ఆమె 'సలోని'అని గారాలు పోయింది త్రిష. "ఆమె నవ్వు, ప్రవర్తన నాకు బాగా నచ్చాయి. తనకు కూడా ఈ సినిమా మంచి బ్రేక్‌గా నిలుస్తుంది. ఇప్పటివరకూ వెంకీతో ఆడవారి మాటలకు.., నమో వెంకటేశ చిత్రాలు చేశాను. ఇది మా ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా. తప్పకుండా హ్యాట్రిక్ కొట్టి తీరతాం. విడుదలైన అన్ని భాషల్లోనూ విజయాన్ని అందుకున్న ఈ కథ తెలుగు ప్రేక్షకులను కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందని నా నమ్మకం అని చెప్పింది" త్రిష. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ వెంకటాద్రిగా కనిపిస్తారు.

    ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, చంద్రమోహన్, తనికెళ్ల భరణి, సుబ్బరాజు తారాగణమైన ఈ చిత్రానికి రచన: కోన వెంకట్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, సంగీతం: ఎస్. తమన్, ఛాయాగ్రహణం: ఆర్థర్ విల్సన్, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కళ: ఎ.ఎస్. ప్రకాశ్, డాన్స్: రాజుసుందరం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహేంద్రబాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపిచంద్ మలినేని.

    English summary
    In Bodyguard film, Hero Venkatesh is playing the role of Venkatadri and the recent trailers with punch dialogues of venkatadri are getting good response from audience
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X