జ్యోతిక ఛాన్స్‌ను కొట్టేసిన త్రిష

By Staff

వెంకటేష్‌ ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాలో హీరోయిన్‌ గా జ్యోతిక నటించవలసి ఉండగా ఇప్పుడామె స్ధానంలో త్రిష ఎంపిక కావడం విశేషం. ఏడాది క్రితం ఈ సినిమా గురించి తొలి ప్రకటన వెలువడినప్పుడు జ్యోతికను హీరోయిన్‌గా ప్రకటించారు. జ్యోతికను తొలగించడానికి కారణం తెలియరాలేదు. దర్శకుడు సెల్వరాఘవన్‌ స్టోరీలైన్‌ చెప్పినప్పుడు త్రిష ఫ్లాట్‌ అయిపోయిందట. ఉద్యోగం చేసే ఆధునిన మహిళగా త్రిష నటించబోతోంది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ నానక్‌రామ్‌ గుడాలో రామానాయుడు స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈనెల 20 నుంచి జరుగనుంది. స్టాలిన్‌ సైనికుడు వంటి భారీ సినిమాల్లో ప్రస్తుతం నటిస్తున్న త్రిష వెంకటేష్‌ సినిమాలో ఆగస్టు నుంచి నటిస్తుంది. వెంకటేష్‌ ఈ సినిమాతో పాటు దేవదాస్‌ ఫేం వైవిఎస్‌ చౌదరిసినిమాలో సమాంతరంగా నటిస్తారు.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X