టాలీవుడ్ బెస్ట్ హీరోయిన్స్ వీరే-2012(ఫోటో ఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్ : 2012లో బెస్ట్ తెలుగు హీరోయిన్స్ ఎవరు? అనే అంశంపై వన్ ఇండియా నిర్వహించిన ఓటింగ్ సర్వేలో సౌతిండియా పాపులర్ నటి త్రిష అందరికంటే ఎక్కువ ఓట్లు దక్కించుకుని టాప్ ప్లేసులో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మిల్కీ బ్యూటీ తమన్నా, హాట్ లేడీ సమంత, కాజల్ అగర్వాల్, నయనతార, అనుష్క శెట్టి, ఇలియాన తదితరులు నిలిచారు.

డిసెంబర్ నెలలో వన్ ఇండియా(ఇంగ్లీష్ ఎంటర్ టైన్మెంట్ వెర్షన్) ఒక నెల పాటు 2012 సంవత్సరపు బెస్ట్ హీరోయిన్ ఎవరు అంశంపై పోల్ నిర్వహించింది. గత సంవత్సరం తెలుగు సినిమాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్లను 10 మందిని ఎంపిక చేసి పోలింగ్ నిర్వహించారు. ఇందులో వేలాది మంది వన్ ఇండియా పాఠకులు పాల్గొన్నారు.

ఈ పోల్‌లో త్రిష కృష్ణన్ టాప్-1 పొజిషన్ దక్కించుకోగా, 2వ స్థానంలో హాట్ మిల్కీ బ్యూటీ తమన్నా, 3వ స్థానంలో హాట్ లేడీ సమంత, 4వ స్థానంలో కాలజ్, 5వ స్థానంలో నయనతార నిలిచింది. సెక్సీ హీరోయిన్స్ అనుష్క, నయన తారలకు టాప్ 5లో చోటు దక్కలేదు.

ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయం స్లైడ్‌ షోలో వీక్షిద్దాం...

త్రిష

త్రిష గత సంవత్సరం బాడీగార్డ్ చిత్రంతో పాటు, దమ్ము చిత్రంలో నటించిది. ఈ రెండు చిత్రాల్లో త్రిష పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. వన్ ఇండియా పోలింగులో త్రిషకు 45.3% ఓట్లు పడ్డాయి.

తమన్నా

హీరోయిన్ తమన్న గత సంవత్సరం నాలుగు పెద్ద సినిమాల్లో నటించింది. అందులో రచ్చ, కెమెరామెన్ గంగతో రాంబాబు, ఎందుకంటే ప్రేమంట, రెబల్ చిత్రాలు ఉన్నాయి. తమన్నాకు పాఠకుల నుంచి 24.8% ఓట్లు పడ్డాయి.

సమంత

2012వ సంవత్సరంలో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్లలో సమంతది కూడా అగ్రస్థానమే. గత సంవత్సరం ఈగ, ఎటో వెళ్లి పోయింది మనసు చిత్రాల్లో నటించిన సమంతకు పాఠకుల నుంచి 17.5% ఓట్లు పడ్డాయి.

కాజల్

గతేడాది బిజినెస్ మేన్, సారొచ్చారు చిత్రాల్లో నటించిన కాజల్ అగర్వాల్‌కు 5.8% ఓట్లు పడ్డాయి.

నయనతార

గత సంవత్సరం శ్రీరామ రాజ్యం చిత్రంలో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నయనతార ‘కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రంలో కూడా నటించింది. అయితే ఆమెకు కేవలం 2.9% ఓట్లు మాత్రమే పడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X