డబ్బుంటే... హీరోయిన్ త్రిష సరుకు మీసొంతం...!(ఫోటోలు)
హైదరాబాద్: ఒకప్పుడు సరుకు అమ్మాలంటే నాణ్యత, మన్నిక ఉంటే చాలు. కానీ ఇప్పుడు కాలం మారింది. పోటీ వాతావరణంలో నాణ్యతతో పాటు గ్లామర్ సొగబులు కూడా అద్దాల్సిన పరిస్థితి. అందుకే పలు కార్పొరేట్ కంపెనీలు సినీ తారలతో ప్రచారం చేయించి మరీ తమ సరుకులకు అమ్మే ప్లాన్స్ వేస్తున్నారు.
సౌత్‌లో లీడింగ్ హీరోయిన్లలో ఒకరుగా ఉన్న త్రిష ఇప్పటికే పలు కార్పొరేట్ ఉత్పత్తులకు ప్రచారం చేస్తోంది. తాజాగా ఆమె మరో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. వేసవి నేపథ్యంలో ఓ ఐస్ క్రీం కంపెనీ తమ ఉత్పత్తులు ఆమెతో ప్రచారం చేయించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని త్రిష తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ఇప్ప ఇప్పటికే స్కూటీ పెప్, కోల్గేట్, ఫాంటా, ఫేయిరెవర్, వివెల్ ఇతర ఉత్పత్తులకు ప్రచారం చేస్తోంది. తాజాగా ఆమె అమెరికాకు చెందిన బెన్ అండ్ జెర్రీ అనే ఐస్ క్రీం కంపెనీకి ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయం అధికారికంగా వెల్లడికానుంది. మరి మీ దగ్గర డబ్బుంటే త్రిష అమ్మే సరుకులు మీ సొంతం..!
త్రిష నటించిన పలు కమర్షియల్ యాడ్స్ ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించండి.

ప్రస్తుతం త్రిష ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న ‘రమ్' చిత్రంలో నటిస్తోంది.

ఫాంటా శీతల పానీయానికి త్రిష గ్లామర్ సొగబులు.

ఫెయిరెవర్ ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్లో త్రిష.

స్కూటీ పెప్ ప్రచార కర్తగా త్రిష.

వివెల్ ఉత్పుత్తులకు త్రిష ప్రచారం.

కోల్గేట్ యాడ్లో త్రిష.

వోలిని యాడర్లో త్రిష.


Click it and Unblock the Notifications











