త్రిష తీరు చూస్తిరా: పవన్ ముద్దు, అతనేమో వద్దు!
చెన్నై: హీరోయిన్ త్రిష మొదటి నుంచి హోమ్లీ పాత్రలే చేసుకుంటూ వస్తోంది. చాలా కాలంగా పెద్దగా గ్లామర్ ఆరబోయకుండానే నిలదొక్కుకుంటూ వచ్చింది. ఆమె ఎంచుకున్న సినిమాలు, పాత్రలు చాలా వరకు త్రిషకు ప్లస్ అయ్యాయి. ఒకానొక సందర్భంలో త్రిష సౌతిండియా నెం.1 హీరోయిన్‌గా వెలిగింది. అయితే కొత్తగా వచ్చి హీరోయిన్ల ఇటు పెర్ఫార్మెన్స్ తో పాటు గ్లామర్ పరంగా కూడా ఇరగదీస్తుండటంతో కాస్త వెనకపడిపోయింది త్రిష.
ఇప్పటికే కట్టా మీఠా చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన త్రిషకు ఇటీవల మరో బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హస్మి హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో నటించమని అడిగారు. స్క్రిప్టు డిమాండ్ మేరకు లిప్ లాక్ సీన్లు, సెక్సీ కాస్టూమ్స్ వేసుకోవాల్సి ఉంటుందని ఆమెకు చెప్పారు. అయితే తాను అలాంటి పాత్రలు చేయనని తేల్చి చెప్పిందట త్రిష.
ఆ మధ్య పవన్ కళ్యాణ్ సరసన 'తీన్ మార్' చిత్రంలో నటించిన త్రిష ముద్దు సీన్లలో పాల్గొనడంతో పాటు చిట్టిపొట్టి డ్రెస్సులతో కనిపించింది. శింబుతో కలిసి 'ఏమాయ చేసావె' తమిళ రీమేక్‌లోనూ ముద్దు సీన్లలో ఇరగదీసింది. వారిద్దరితో మద్దు సీన్లు, సెక్సీ కాస్టూమ్స్‌తో రెచ్చిపోయిన త్రిష... బాలీవుడ్ ఆఫర్ ఎందుకు తిరస్కరించిందని ప్రశ్నిస్తున్నారు.
త్రిష సినిమాల విషయానికొస్తే...ఆమె తెలుగులో చివరగా నటించిన 'దమ్ము' చిత్రం అనుకున్న అంచనాలను చేరుకోక పోవడంతో అమ్మడు మళ్లీ కాస్త వెనకబడిపోయింది. ప్రస్తుతం ఆమె మూడు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. విశాల్ సరసన 'సమర్' చిత్రంతో పాటు... జయంరవి సరసన 'భూలోగం' చిత్రంలో, హీరో జీవాతో కలిసి 'ఎండ్రెండ్రుమ్ పున్నాగయ్' చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











