ఎంగేజ్ మెంట్ విషయమై నోరు విప్పిన త్రిష
హైదరాబాద్: చెన్నై అంతటా ఓ వార్త గుప్పుమంది. త్రిష రెండు రోజుల క్రితం అంటే 16 వ తేదీన వరుణ్ అనే మీడియా ప్రొప్రైటర్ తో నిశ్చితార్దం జరుపుకుందని వార్త సారాంసం. ఇరు వైపుల నుంచి ఏ విధమైన అధికారిక కన్ఫర్మేషన్ లేనప్పటికీ ఈ వార్త పూర్తి హాట్ టాపి్ గా మారింది. దాంతో మీడియాలోనూ ఈ వార్త ప్రసారమవటం మొదలెట్టింది. దాంతో త్రిష ట్విట్టర్ లో ఈ విషయం గురించి ప్రస్దావిస్తూ ట్వీట్ చేసింది.
త్రిష ట్వీట్ లో...'' నాకు ఎంగేజ్ మెంట్ లాంటిదేమి జరగలేదు... అలాంటిదేమన్నా జరిగితే..నా నుంచే మొదట మీరు వింటారు.. '' అంది. ఇక ఈ మధ్య కాలంలో త్రిష విషయమై రకరకాల రూమర్స్ ప్రచారంలోకి రావటం మొదలయ్యాయి. వాటిని సాధ్యమైనంత వరకూ త్రిష ఖండిస్తూ వస్తూనే ఉంది.

కొద్ది రోజుల క్రితం కన్నడ చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాను చేయటం లేదంటూ ఖండించింది. కన్నడంలో రీమేక్ అవుతున్న అత్తారింటికి దారేది చిత్రంలో త్రిష నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఆమె స్పెషల్ సాంగ్ చేస్తోందని అన్నారు. తెలుగులో ముంతాజ్, హంసా నందిన చేసిన సాంగ్ కు ఆమె స్టెప్స్ వేస్తోందని అన్నారు. అందులోనూ ఆమె రీసెంట్ గా కన్నడంలో పవర్ చిత్రంలో ఎంట్రీ ఇవ్వటంతో అంతా అది నిజమే అని నమ్మారు. అయితే త్రిష తల్లి ఆ వార్తలను ఖండించింది. తమ వద్దకు అలాంటి ప్రపోజల్ ఏమీ రాలేదని, ఆ చిత్రం యూనిట్ వారు ఎవరూ కలవలేదని అంది.
త్రిష ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే...
త్రిష కు చెప్పుకోతగ్గ పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. అయినా ఆమె తన రెమ్యునేషన్ విషయంలో మాత్రం ఏ మాత్రం రాజీ పడలేదని సమాచారం. బాలకృష్ణ తో చేస్తున్న గాడ్సే చిత్రం కోసం ఆమెకు ఇచ్చిన ఎమౌంట్ గురించే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమెకు కోటి పాతిక లక్షలు వరకూ పే చేసారని తెలుస్తోంది. మొదట నిర్మాతలు అంత పే చేయటానికి ముందుకు రాలేదని అయితే బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి వారిని ఒప్పించి, ఆమెను తన సినిమాలోకి తీసుకున్నారని వినిపిస్తోంది.
త్రిష తమిళంలో ఓ చిత్రం చేస్తోంది. అందులో త్రిష తన అభిమానులకు ఆనందం కలిగించేలా స్పెషల్ లేదా ఐటం సాంగ్ చేస్తోంది. ఆ చిత్రం మరేదో కాదు..అజిత్ తో గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న చిత్రం. ఈ చిత్రం అనుష్క హీరోయిన్ కావటం విశేషం. ఈ విషయాన్ని తన మైక్రో బ్లాగింగ్ సైట్ ద్వారా సంగీత దర్శకుడు హ్యారీస్ జైరాజ్ తెలియచేసారు.
'తల' అజిత్ 55వ చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఆ సినిమాకు పేరుపెట్టకపోయినా.. 'తల - 55' పేరుతో ఇప్పటికే పోస్టర్లు, బ్యానర్లు నగరంలో భారీగా దర్శనమిస్తున్నాయి. గౌతంమీనన్ దర్శకత్వంలోని ఈ సినిమాలో అనుష్క కథానాయిక. త్రిష ముఖ్య భూమిక పోషిస్తోంది. ఇందులో ఆమె ఓ ప్రత్యేక గీతంలో చిందులేసినట్లు సమాచారం.
గౌతంమీనన్ దర్శకత్వంలో 'కాక్క కాక్క' వంటి పలు సినిమాలలో అవకాశాలు వచ్చినా.. కొన్ని కారణాల వల్ల అజిత్ నటించలేదు. చాలా కాలం తర్వాత వారి కాంబినేషన్లో యాక్షన్ కథాంశంతో దీన్ని తెరకెక్కించారు. అజిత్ పోలీసు పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ డాన్ మెక్కాతర్ ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. హ్యారీస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు.
షూటింగ్ దాదాపు పూర్తయిందని సమాచారం. క్లెమాక్స్ సన్నివేశాలను హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు. రెండు పాటలు, కొన్ని ప్యాచ్ సన్నివేశాలే ఉన్నాయి. ఈ నెలాఖరులో సినిమా పేరు ప్రకటించి.. ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











