కుక్కల కోసం త్రిష.... త్రిష కోసం అభిమానులు!
జంతువులపై ప్రేమతో హీరోయిన్ త్రిష యానిమల్ వెల్ఫేర్ ఫౌండేషన్ తో కలిసి పని చెయ్యడానికి సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ఈ వెల్ఫేర్ కార్యక్రమానికి అమలతో కలిసి హాజరయ్యారు. జంతువులను దత్తత తీసుకోవాలంటే ఈ ఫోన్ నెంబర్స్ మరియు మెయిల్ ఐడీల ద్వారా సంప్రదించండి సదరు ఫౌండేషన్‌కు సంబంధించిన ఫోన్ నెంబర్లు అని తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది త్రిష.
అది చూసిన అభిమానులు వాటికి కాల్ చేస్తే త్రిష మాట్లాడుతారనే ఉద్దేశంతో ఆ ఫౌండేషన్ కి ఎక్కువ కాల్స్ చేస్తున్నారు. రోజు ఇలా లెక్కలేనన్ని కాల్స్ రావడం ఫౌండేషన్ కి ఇబ్బందిని కలిగించింది. ఇది తెలిసి బాధపడిన త్రిష వెంటనే స్పందించి....అవి తన నెంబర్స్ మరియు మెయిల్ ఐడీలు కాదని అవి ఆ ఫౌండేషన్ యొక్క వాలంటీర్స్ కి సంభందించినవి అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
పాపం.... కుక్కల బాగు కోసం త్రిష ఏదో ఆలోచించి ఏదో చేస్తే...త్రిషతో మాట్లాడాలనే ఆశతో అభిమానులు ఫోన్లమీద ఫోన్లు కొట్టారు. వెరసి సదరు స్వచ్చంద సంస్థ వారు ఇబ్బంది పడాల్సి వచ్చింది.
త్రిష సినిమాల విషయానికొస్తే...ఆమె తెలుగులో చివరగా నటించిన 'దమ్ము' చిత్రం అనుకున్న అంచనాలను చేరుకోక పోవడంతో అమ్మడు మళ్లీ కాస్త వెనకబడిపోయింది. ప్రస్తుతం ఆమె మూడు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. విశాల్ సరసన 'సమర్' చిత్రంతో పాటు...జయంరవి సరసన 'భూలోగం' చిత్రంలో, హీరో జీవాతో కలిసి 'ఎండ్రెండ్రుమ్ పున్నాగయ్' చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











