మహేష్ బాబుతో అలా నటించడానికి ‘నో’ చెప్పిన త్రిష
చాలా కాలం నుంచి పరిశ్రమలో తన ఉనికిని కాపాడు కుంటూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ముందుకు సాగుతోంది త్రిష. ఇప్పటి వరకు పరిశ్రమలో దాదాపు అందరు అగ్రహీరోలతో రొమాన్స్ చేసింది. తాజాగా దిల్ రాజు నిర్మించ బోతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాలో త్రిష స్థానం దక్కించుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వెంకటేష్-మహేష్ బాబు మల్టీస్టారర్(అన్నదమ్ములుగా) గా రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష మహేష్ బాబు వదిన(వెంకీ భార్య) పాత్ర పోషిస్తుందని, సమంత మహేష్ సరసన నటిస్తుందనే వార్తొలొచ్చాయి.
అయితే ఈ వార్తలను త్రిష మండి పడుతోంది. తాను మహేష్ బాబుకు వదిన పాత్రలో చేయడం లేదని, ఇవన్ని పచ్చి పుకార్లే అని కొట్టి పారేసింది. తాను ఇప్పటికే మహేష్ బాబుతో అతడు, సైనికుడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించానని, ఈ సినిమాలో అతనికి వదినగా నటించడానికి సిద్ధంగా లేనని తేల్చి చెప్పిందట. వదిన పాత్ర చేస్తున్నట్లు వచ్చిన వార్తలు విని షాక్ కు గురయ్యానని చెప్పుకొచ్చిందని తెలుస్తోంది. మరి త్రిష కామెంట్స్ పై మహేష్ బాబు, వెంకటేష్ ఎలా స్పందిస్తారో? చూడాలి.
ప్రస్తుతం త్రిష తెలుగులో ఎన్టీఆర్ సరసన 'దమ్ము" చిత్రంలో ఎంపికైంది. అయితే ఈ విషయాన్ని సనిమా యూనిట్ సభ్యులు నిర్ణారించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











