త్రిష ఆనందానికి కారణం ఆయనతో పంచుకోవడమేనట!
ఎప్పటి నుండో కలలు కంటున్న త్రిష గొప్ప కల త్వరలో నెరవెరబోతుంది. అబ్బురపరచే అభినయాన్నీ అందమైన చిరునవ్వునే ఆయుధాలుగా చేసుకుని యువకుల హృదయాలలో స్థానాన్ని సంపాదించిన ఈ వానపాప తన చిరకాల వాంఛ కమల్ హాసన్ తో కలిసి నటించడమే అని ఆ మద్య పిచ్చపిచ్చగా చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. మధ్యలో త్రిషకు రెండు సార్లు ఆ అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్ అయింది. అయితే ఒక్కసారి స్వయతప్పిదంతో అవకాశం కోల్పోతే..రెండో సారి ఆ చిత్రమే ఆగిపోయింది..తాజా చిత్రంలో మాత్రం అలా అవకాశం వచ్చిందో లేదో వెంటనే తానే పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ డేట్స్ ఇచ్చేసిందట. ప్రస్తుతం చిత్ర షూటింగ్ లో కమల్ హాసన్ సరసన నటిస్తున్న త్రిష పిచ్చ హ్యాఫీగా ఉందట.
కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నాడు. ఇందులో త్రిషకి కళ్లు తిరిగిపోయేలా కలిసి వచ్చిన మరో అవకాశం ఏమిటో తెలుసా? ఈ చిత్రానికి సంగీతం దేవీశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. కమల్, త్రిషలతో ఓ పాట(పొయటిక్ లైన్)ను కూడా పాడించాడట, ఇది బ్యాక్ గ్రౌండ్ అపీయరెన్స్ గా ఉంటుంది. ఇదే ఈ చిత్రానికి హైలైట్ అంటున్నారు. అంతే తన ప్రక్కన పాత్రనే కాదు పాటను కూడా పంచుకోవడంతో త్రిష ఆనందానికి అవధులు లేవట తొలిసారి కమల్ తో తనను కలిపినందుకు త్రిష దేవిశ్రీకి కతజ్ఝతలు కూడా తెలిపిందట. ఇంకా ఈ చిత్రంలో మాదవన్, సంగీతా ప్రధాన పాత్రలు చేయనున్నారు.


Click it and Unblock the Notifications











