twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రమాదం ఊహించే దూరంగా ఉన్నాను: త్రిష

    By Srikanya
    |

    కెరీర్ ఆరంభించిన ఆరేడేళ్ల వరకు కమర్షియల్ హీరోయిన్ అనిపించుకుంటేనే సేఫ్. అలా కాకుండా ఒక్క ఆర్ట్ సినిమా చేసినా ఆర్ట్ సినిమా హీరోయిన్ అని ముద్ర వేస్తారు. ఇక అప్పుడు అందులోంచి బయటకు రావడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఈ ప్రమాదం ఊహించే నేను ఆర్ట్ సినిమాలకు దూరంగా ఉన్నాను. ఇప్పుడా అవసరంలేదు. మంచి కమర్షియల్ హీరోయిన్ అనిపించుకున్నాను కాబట్టి... నచ్చిన సినిమాలు చేసే స్థాయిలో ఉన్నాను. ఆర్ట్ సినిమాకి అవకాశం వస్తే నిర్భయంగా ఒప్పుకుంటా అంటోంది త్రిష. మీరిప్పటివరకు నటించినవన్నీ దాదాపు కమర్షియల్ చిత్రాలే. మరి, ఆర్ట్ సినిమాకి అవకాశం వస్తే చేస్తారా? అని త్రిషను అడిగితే ఇలా స్పందించింది. అలాగే ఇదే ప్రశ్నను మీరు మూడు, నాలుగేళ్ల క్రితం అడిగి ఉంటే... చెయ్యనని చెప్పేదాన్ని. కమర్షియల్ చిత్రాలను నేను ఎంజాయ్ చేస్తాను. డాన్స్, డ్రామా, గ్లామర్.. ప్రధానంగా ఈ చిత్రాలు సాగుతాయి కాబట్టి చేసేటప్పుడు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి అంది. ప్రస్తుతం ఆమె వెంకటేష్ సరసన బాడీగార్డ్ రీమేక్ లో చేస్తోంది. అలాగే బాడీగార్డు నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆమె నటించిన తమిళ చిత్రం మంగత్తా రైట్స్ ని ఫాన్సీ రైట్స్ కు కొనుగోలు చేసి గ్లాంబ్లర్ గా మొన్న శుక్రవారం విడుదల చేసారు. వీటితో పాటు ఆమె బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్ లో త్వరలో తెరకెక్కనున్న చిత్రం కోసం కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . ఇక ఈ చిత్రం టైటిల్ హరహర మహాదేవ. వీటితో పాటు విశాల్ సినిమాను కూడా ఓకే చేసింది.ఇక త్రిష హఠాత్తుగా విశాల్ ప్రాజెక్టుని ఎందుకు ఓకే చేసింది అంటే..దర్శకుడు తిరు చెప్పిన కథ నచ్చింది అంటోంది.ఆ కథ విని ధ్రిల్లయ్యానని అంటోంది. అలాగే బాలకృష్ణ సినిమాలో కూడా ఆమె చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

    English summary
    Trisha gave green signel to Art Film. Her latest film Gambler was released on Friday. Ajit played the lead in this film in which Arjun and Vaibhav played key roles. Venkat Prabhu is the director and Yuvan Shankar Raja is the music director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X