»   » త్రిషని బికినిలో చూస్తేనే కదా బాగుందో లేదో చెప్పడానికి..!

త్రిషని బికినిలో చూస్తేనే కదా బాగుందో లేదో చెప్పడానికి..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అవకాశాలు తగ్గిపోతున్నయనో...లేక మరిన్ని అవకాశాలను సృష్టించుకోవాలనో తెలియదు కానీ తమిళ కుట్టి త్రిష కృష్ణన్ కూడా బికిని క్లబ్ లో చేరటానికి సిద్దం అయినట్టు తెలుస్తుంది. అది కూడా ఏ తమిళ సినిమా కోసమో, హిందీ సినిమా కోసమో అనుకునేరు, అమ్మడు తొలిసారి బికినిలో కనువిందు చేయనుంది ఓ తెలుగు సినిమా కోసం కావటం విశేషం.

వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న మలయాళం రీమేక్ 'బాడీ గార్డ్' లో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ బికిని లో కనిపించే విధంగా ఓ సన్నివేశాన్ని రూపొందించారు. త్రిష ఒప్పుకుంటుందో లేదో అనే అనుమానంతోనే ఆమెను సంప్రదించారట సినిమా రూపకర్తలు, కానీ త్రిష ఆ సీన్ కోసం అదనంగా చార్జీలు వేసి ఒప్పుకుందని సమాచారం.

ఇప్పటికే 'తీన్ మార్' చిత్రంలో పొట్టి డ్రస్సుల్లో త్రిషను చూసి వెర్రేత్తి పోయిన కుర్రకారు ఆమె బికినిలో ఎలా ఉంటుందో అని ఊహల్లో తేలిపోతున్నారు. మరికొందరేమో ఈ పొడుగు కాళ్ళ సుందరికి బికిని అంతగా నప్పదేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా చూస్తేనే కదా బాగుందో లేదో చెప్పటానికి అని మరికొందరు అంటున్నారు. ఇలా త్రిష బికిని విషయంలో ఎవరి అంచనాలు వారికున్నాయి. మరి ఎవరి అంచనాలు కరక్ట్ అవుతాయో తెలుసుకోవాలంటే మాత్రం బాడీ గార్డ్ విడుదల వరుకు వేచి ఉండాల్సిందే.

English summary
It is known news that Trisha has been roped in as the heroine for the remake of the Malayalam hit ‘Bodyguard’. This has Venkatesh in the lead while Gopichand Malineni of ‘Don Seenu’ fame is the director. Reliable sources say producer Bellamkonda Suresh has got into an agreement with Trisha that she would sport a bikini to bring craze to the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu