twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రిష కడుపులో సీతాకోక చిలుకలు

    By Sindhu
    |

    ఈ మధ్య హీరోయిన్స్‌ బికినీ వేసి తమ అందాలను చూపిస్తున్నారు...వీరికి విరుద్దంగా అందాల చొట్టబుగ్గల త్రిష మాత్రం తన గ్లామర్‌ను లంగా ఓణీలో చూపిస్తోంది. 'వర్షం" చిత్రంలో 'నువ్వొస్తానంటే...నేను వదంటానా..." అంటూ లంగా ఓణీ వేసుకొని వర్షంలో తడుస్తూ స్టార్‌ హీరోయిన్‌ల లిస్ట్‌లో చేరిపోయింది. ఎంత త్వరగా స్టార్‌డమ్‌ సంపాదించు కుందో అంతే త్వరగా ఈమెను గాసిప్స్‌ వెంటాడాయి.

    ఇక అసలు విషయానికి వస్తే...హిందీలో ప్రియదర్శన్ దర్శకత్వంలో త్రిష మరియు అక్షయ్ కుమార్ నటించిన తొలి చిత్రం 'కట్టా మీఠా". ఈ చిత్రం 1989లోని వెల్లానకలుడే నాడు" అనే మళయాల చిత్రానికి రీమేకే ఈ కట్టామీటా. ఈ నెల 23న రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి త్రిష మాట్లాడుతూ...'ఏ సినిమా రిలీజ్‌ అప్పుడు పడని టెన్షన్‌ ఈ సినిమా రిలీజ్‌కు పడుతున్నాను అంటూ....నా కడుపులో సీతాకోక చిలుకలు తిరుగుతున్నట్లుగా గడబిడగా ఉంది. ఎందుకంటే నన్ను సౌత్‌ ప్రేక్షకులు బాగా ఆదరించారు...నార్త్‌ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనని టెన్షన్‌గా ఉంది" అని అంటోంది త్రిష.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X