»   » సల్మాన్ ఖాన్‌కు హీరోయిన్ త్రిష పెళ్లి ప్రపోజల్

సల్మాన్ ఖాన్‌కు హీరోయిన్ త్రిష పెళ్లి ప్రపోజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్‌‌ను పెళ్లాడటానికి రెడీ అంటూ ఎంతో మంది అమ్మాయిలు ఆశ పడుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ త్రిష కూడా సల్మాన్ ఖాన్‌ను పెళ్లాడాలని ఆ పడుతోంది. ఈ విషయాన్ని త్రిష స్వయంగా వెల్లడించింది. తమిళ టీవీ ఛానల్ విజయ్‌లో ప్రసారం అవుతున్న 'కాఫీ విత్ డిడి' కార్యక్రమంలో త్రిష ఈ వ్యాఖ్యలు చేసింది.

త్రిష, జీవా కలిసి నటించిన 'ఎండ్రెండ్రుమ్ పున్నాగై' గత వారం విడుదలై నేపథ్యంలో.... తమిళ టీవీ యాకర్ దివ్య దర్శిని హోస్ట్ చేస్తున్న ఈకార్యక్రమంలో త్రిష, జీవా పాల్గొన్నారు. పెళ్లి ప్రపోజ్ చేయాల్సి వస్తే.....సినిమా స్టార్లలో ఎవరికి చేస్తారు? అనే ప్రశ్నకు త్రిష స్పందిస్తూ.....సల్మాన్ ఖాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన్ని పెళ్లాడటానికి తాను రెడీ అని వ్యాఖ్యానించింది త్రిష. మరి త్రిష వ్యాఖ్యలపై సల్మాన్ ఎలా స్పందిస్తారో? చూడాలి.

'ఎండ్రెండ్రుమ్ పున్నాగై' సినిమా విషయానికొస్తే....జీవా, త్రిష జంటగా నటించిన ఈచిత్రంలో వినయ్ రాయ్, సంతానం, ఆండ్రియా ముఖ్య పాత్రలు పోషించారు. జికెఎం తమిళ్ కుమారన్ నిర్మించిన ఈచిత్రానికి ఐ.మీనుద్దీన్ అహ్మద్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 20 ఈచిత్రం విడుదలైంది.

ఇక త్రిష ఇతర సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం ఆమె తెలుగులో 'రంభ ఊర్వశి మేనక', తమిళంలో 'భూలోగం', 'కన్నాలే కన్నన్' అనే చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్నీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది ఇవి విడుదల కానున్నాయి.

English summary

 Popular Bollywood actress Trisha Krishnan has expressed her desire to marry Salman Khan, Bollywood’s most eligible bachelor who recently turned 48.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu