ఆ స్టార్ హీరోలను ట్రాప్ చేయటానికే త్రిష అలా
త్రిష చాలా తెలివైంది..ఆమెకు తెలిసినన్ని మార్కెటింగ్ టెక్నిక్ లు మిగితా హీరోయిన్స్ కి తెలియవు అంటారు. తాజాగా ఆమె ఏ మాయె చేసావె హిందీ వెర్షన్ లో చేస్తోంది. దాంతో అక్కడ హీరోల భజన ప్రారంభించింది. ఆమె రీసెంట్ గా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ... బాలీవుడ్ కింగ్ లు అయిన ముగ్గురు ఖాన్‌లనూ నేను ఇష్టపడతా. షారుక్ చేసిన చక్‌దే ఇండియా ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. అలాగే సల్మాన్ ఉన్నంత ఎట్రాక్టివ్ గా ఎవరూ ఉండరని నా అభిప్రాయం. నా లాంటి అమ్మాయిలందరికీ ఆయన డ్రీమ్ బోయ్. ఇక వైవిధ్యమైన నటనకు కేరాఫ్ ఎడ్రస్ అమీర్ ఖాన్. సినిమానే ఊపిరిగా భావించే అతికొద్దిమంది మహానటుల్లో అమీర్ ఒకరు అని అంది త్రిష. ఇక కట్టా మీటాలో తనతో చేసిన అక్షయ్ గురించి చెబుతూ. క్రమశిక్షణ అనేది ఆయన నుంచే నేర్చుకోవాలి. షూటింగ్ ఆరు గంటలకు అంటే.. సరిగ్గా పది నిమిషాలకు ముందే సెట్‌లో ఉండేవారు అక్షయ్. అంత పెద్ద సూపర్‌స్టార్‌గా ఆయన ఎలా ఎదిగారో అప్పుడు అర్థమయ్యింది అంది అదీ మ్యాటర్.


Click it and Unblock the Notifications