వర్మ'కంపెనీ'పుట్టిన విధం

ఆ సంభాషణల్లో అతను రకరకాల విషయాలు ప్రస్తావించాడు. దావూద్ కి ఛోటా రాజన్ కి మధ్య జరిగిన గొడవ చెప్పుకొచ్చాడు. అంతేగాక వాళ్ళిద్దరూ ఒకరినొకరు అసహ్యంచికుంటారు ఎందుకంటే ఒకరంటే ఒకరికి ఇష్టమని,ప్రాణం కాబట్టి అని చెప్పుకొచ్చాడు. అంతెందుకు దావూద్ ఫోన్ చేస్తే..ఇప్పటికీ ఛోటా తన చేతిలోని సిగెరెట్ క్రింద పడేసి దావూద్ బయ్యా అంటాడు.ఆ పాయింట్ నుంచే కంపెనీ సినిమా పుట్టింది. అలాగే సత్య సినిమా కోసం అండర్ వరల్డ్ కి సంభందించిన అనేక విషయాలు సేకరించాను..కానీ వాటినన్నటినీ సినిమాలో ఇన్ కార్పోరేట్ చేయలేక పోయాను. ముఖ్యంగా పోలీస్ ప్రొసీజర్స్ ...అలా మిగిలిన వాటిని ఈ సినిమాలో వాడుకున్నాను.
ఇక ఆ అట్మాస్మియర్ కోసం నన్ను నేనే ఆశ్రయించుకున్నాను. నేను చాలా కాలంగా కంపెనీ నడుపుతున్నాను. ఆ అనుభవాలుని ఇందులో ఇమిడ్చాను.ముఖ్యంగా అందరిలో నేను గమనించింది..రకరకాల జనం ఒకచోట పనిచేస్తూన్నప్పుడు ఇంటిలిజెంట్ లెవిల్స్ లో తేడా ఉండటం వల్ల రైవల్స్ వస్తూంటాయి.అప్పుడే ప్రస్టేషన్ వంటివి చోటుచేసుకుంటాయి.ఇక సత్య,కంపెనీల తేడా ఏమిటంటే సత్య ఎమోషనల్,కంపెనీ ఇంటిల్జెంట్ అంటూ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











