'జల్సా' కాంబినేషన్ (పవన్-త్రివిక్రమ్) మళ్ళీ కలసి పనిచేస్తున్నారని తెలుస్తోంది. అదీ 'పులి' చిత్రం కోసం. ఓకె.మీరనుకుంటున్నట్లు ...త్రివిక్రమ్ పవన్ ని మళ్ళీ డైరక్ట్ చేయటం లేదు..అంటే డైలాగులు రాస్తున్నాడా అని అడుగచ్చు...అదేం కాదు...పులి కోసం పాటలు రాయనున్నారు. గతంలో 'చింతకాయల రవి' ఫేమ్ యోగి తొలిచిత్రం 'ఒక రాజు...ఒక రాణి' కి పాటలు రాసిన ఆయన ఈ సారి 'పులి' కి పెన్ను విదిలించనున్నారు. అయితే త్రివిక్రమ్ పాటలు రాయటాన్ని కంటిన్యూ చేయరట. హాబీగా అప్పుడప్పుడూ ఈ పని చేయనున్నారుట. అదీ తనకు ఇష్టమైన,నచ్చిన వారి చిత్రాలకేనట. ఇక 'పులి' చిత్రానికి ఏ.ఆర్. రహమాన్ సంగీతం అందించనున్నారు. ఆయన సంగీతానికి త్రివిక్రమ్ సాహిత్యం పవన్ స్టెప్స్ అదురుతుంది కదూ!!!