twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్‌కు ఇచ్చిన సర్ ప్రైజ్ అదే.. మగవాళ్లకు ఆ మాట చెప్పను.. త్రివిక్రమ్ ఇరగ్గొట్టేశాడు!!

    |

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడతాడో.. అందులో ఎన్ని విషయాలుంటాయో అందరికీ తెలిసిందే. అల వైకుంఠపురములో సినిమా విడుదలై ఏడాది అవుతున్న సందర్భంలో ఓ స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. రీ యూనియన్ అంటూ పెట్టిన ఈవెంట్‌లొ అల్లు అర్జున్ గురించి, సినిమా విశేషాల గురించి తివిక్రమ్ మాట్లాడాడు. అందులో ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

    బాల్కనీలో కూర్చుని..

    బాల్కనీలో కూర్చుని..

    అల్లు అర్జున్ నేను బాల్కనీలో కూర్చుంటూ బ్లాక్ కాఫీ తాగుతూ ఏదో ఒక సినిమా చేయాలి.. మంచి సినిమా చేయాలి.. కానీ ఏం చేయాలో అప్పటికీ ఏది తెలియదు.. అలా ఈ సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి. ఓ స్టోరీ లైన్ రాసుకోవడం దాన్ని డెవలప్ చేస్తూ అలా అలా ముందుక తీసుకెళ్లడం జరిగిందంటూ త్రివిక్రమ్ చెప్పాడు.

    ప్రతీ ఒక్కటి తెలుసు..

    ప్రతీ ఒక్కటి తెలుసు..

    అల వైకుంఠపురములో సినిమాలో బన్నీకి తెలియకుండా ఏది జరగలేదు. ప్రతీ సీన్ ప్రతీ డైలాగ్ స్క్రిప్ట్, సెట్ ఇలా ప్రతీ ఒక్కటీ బన్నీకి తెలుసు. బన్నీకి తెలియకుండా సినిమాకు సంబంధించిన ఏ విషయం కూడా జరగలేదు. చివరకు స్క్రిప్ట్ అంతా రెడీ అయ్యాక అల్లు అరవింద్‌కు చూపించాడు. ఓకే షూటింగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నారని అడగడం, అప్పుడు నేను బన్నీ సినిమా ఫిక్స్ అయిందని నిర్ణయించుకున్నామని తివిక్రమ్ చెప్పుకొచ్చాడు.

    ఫోటోలు: అల వైకుంఠపురము రీయూనియన్..పాల్గొన్న చిత్ర బృందం

    ఇదొక్కటే సర్ ప్రైజ్..

    ఇదొక్కటే సర్ ప్రైజ్..

    బన్నీకి తెలియకుండా మేం ఏదైనా చేశామా? అంటే ఇదొక్కటే.. ఈ ఈవెంట్ మాత్రం బన్నీకి తెలియకుండా సర్ ప్రైజ్ ఇచ్చాము. అంతకు మించి బన్నీకి ఏమీ ఇవ్వలేదు. సినిమాలో ప్రతీ విషయం బన్నీకి తెలిసే జరిగింది.. ఈ సినిమాకు మాకు పెళ్లి ఆల్బమ్‌లా ప్రతీసారి మేం చూపిస్తూనే ఉంటాం చెబుతూనే ఉంటాం.. మీరు చూడాల్సిందే తప్పదు అంటూ త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు.

    సముద్రఖని గురించి..

    సముద్రఖని గురించి..

    అల వైకుంఠపురములో సినిమా నటీనటుల గురించి మాట్లాడుతూ సముద్రఖని గురించి త్రివిక్రమ్ ఎంతో గొప్పగా మాట్లాడాడు. చిన్న పాత్రే అయినా చేయడానికి ఒప్పుకున్నాడు.. సిత్తరాల సిరపడే పాటలో అద్భుతంగా నటించాడు.. చివరి క్షణంలో వచ్చిన ఆలోచన అది అని.. లవ్యూ యూ అంటూ చెప్పేశాడు. తాను సాధారణంగా మగవాళ్లకు ఐ లవ్యూ చెప్పను కానీ మీకు చెబుతున్నా అంటూ త్రివిక్రమ్ పేర్కొన్నాడు.

    Recommended Video

    Pawan Kalyan - Rana Daggubati MultiStarer : టైటిల్ గా చిరు పాత హిట్ మూవీ, పారితోషికం వివరాలు !

    English summary
    Trivikram About Surprise to Allu Arjun.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X