ముంబైలోనే కట్ చేసిన త్రివిక్రమ్
ముంబై : ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సెల్ కాన్ యాడ్ చిత్రీకరణలో భాగంగా ముంబైలో ఉన్నారు. ఇక్కడ ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి, హీరోయిన్ తమన్నాలపై యాడ్ చిత్రీకరణకు దర్శకత్వం చేస్తున్నారు. నిన్న(నవంబర్ 7)న త్రివిక్రమ్ పుట్టిన రోజు. సాధారణంగా తన పుట్టిన రోజును ఆర్భాటంగా జరుపుకోవడానికి ఇష్ట పడని త్రివిక్రమ్ సాధారణంగానే షూటింగ్ స్సాట్ కు వచ్చి తన పనిలో తలమునకలై పోయాడు.
అయితే యూడ్ ఫిల్మ్ యూనిట్ సభ్యులు త్రివిక్రమ్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసి సర్ ఫ్రైజ్ చేసారు. వారి రిక్వెస్ట్ మేరకు సెట్ లోనే కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు త్రివిక్రమ్. అనంతరం యదావిధిగా తన వర్క్ లో బిజీ అయిపోయాడు ఈ దర్శకుడు.
'జల్సా' మూవీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో భారీ అంచనాలతో ఓ చిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని, ప్రస్తుతం స్క్రిప్టుకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే టైటిల్ ఖరారు చేస్తామని చెప్పిన త్రివిక్రమ్, అప్పటి వరకు టైటిల్ విషయంలో ఎలాంటి వార్తలు ప్రచారం చేయవద్దని రిక్వెస్ట్ చేసారు.
ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. వరుసగా పెద్ద హీరోలు, పెద్ద దర్శకుల చిత్రాల్లో నటిస్తూ హిట్స్ కొడుతున్న సమంత ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన దాదాపుగా ఖరారైనట్లే.


Click it and Unblock the Notifications











