twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గూరూజీతో పెట్టుకుంటే అంతే: యాంకర్‌ శ్యామలకు త్రివిక్రమ్ క్లాస్... ఎన్టీఆర్ ఫిదా!

    |

    ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అరవింద సమేత' చిత్రం రాయలసీమలోని కొమ్మద్ది, నల్లగుడి అనే రెండు ప్రాంతాల మధ్య జరిగే ఫ్యాక్షన్ గొడవల నేపథ్యంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రూ. 5 విషయంలో బసిరెడ్డి మొదలు పెట్టిన హత్య రెండు ప్రాంతాల మధ్య ఫ్యాక్షన్ గొడవలకు దారి తీసినట్లు సినిమాలో చూపిస్తారు.

    అయితే ఇటీవల ఇంటర్వ్యూలో త్రివిక్రమ్‌కు ఇందుకు సంబంధించి యాంకర్ శ్యామల నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. కేవలం ఐదు రూపాయల కోసం హత్యలు జరుగుతాయా? అని ఆమె ప్రశ్నించడంతో త్రివిక్రమ్ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఆమెకు పెద్ద క్లాస్ పీకాడు.

    ఇటుకతో మొదలైన త్రివిక్రమ్ వాదన

    ఇటుకతో మొదలైన త్రివిక్రమ్ వాదన

    ఈ సినిమాలో జరిగింది ఎగ్జాక్ట్‌గా పెట్టలేదు అంటూ పలు ఉదాహకరణ ఇవ్వడం మొదలు పెట్టాడు త్రివిక్రమ్. ఇటుక గురించి కొన్ని వేల లక్షల మంది కొట్టుకుంటారు. అదే బాబ్రీ మసీదు సంఘటన. కరసేవకులు ఇటుక పట్టుకుని వెళ్లడం వల్లనే కదా అక్కడ గొడవ జరిగింది... అంటూ త్రివిక్రమ్ తన వాదన మొదలు పెట్టారు.

    మనుషులు కొట్టుకుంటారు

    మనుషులు కొట్టుకుంటారు

    మనుషులు కొట్టుకుంటారు. అందులో ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. కొట్టుకుని కొట్టుకుని ఏ లెవల్‌కి వెళ్లిపోతారంటే ఎక్కడ మొదలు పెట్టామో మరిచిపోతారు అంటూ తన వాదన మరింత పెంచాడు గురూజీ.

    పురాణాలు, త్రేతాయుగంలోకి

    పురాణాలు, త్రేతాయుగంలోకి

    పురాణాల్లో హిరణ్యాష్యుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి ఏడు సముద్రాల కింద దాక్కుంటే విష్ణుమూర్తి చేపలాగా వెళ్లి చంపాడు. తర్వాత త్రేతాయుగంలో సీతను రావణాసురుడు ఎత్తుకెళ్ళి లంకలో దాస్తే ఓ బ్రిడ్జి కట్టుకుని వెళ్లి రాముడు అతడిని చంపాడు. తర్వాత పాండవులు, కౌరవులు ఈ రాజ్యం ఎవరి దక్కాలనే విషయంలో కురుక్షేత్రంలో కొట్టుకుని చనిపోయారు... అని త్రివిక్రమ్ తెలిపారు.

    కాజ్ ఆఫ్ ది వార్, ప్లేస్ ఆఫ్ ది వార్

    కాజ్ ఆఫ్ ది వార్, ప్లేస్ ఆఫ్ ది వార్

    ఈ మూడింట్లో మీరు ఓ విషయాన్ని అబ్జర్వ్ చేస్తే మొదటి దాంట్లో కాజ్ ఆఫ్ ది వార్ నాలెడ్జ్... ప్లేస్ ఆఫ్ ది వార్ ఎక్కడో ఏడు సముద్రాల కింద, నెక్ట్స్ కాజ్ ఆఫ్ ది వార్ కాస్త తగ్గింది. సీత అనే అమ్మాయి కోసం జరిగింది... ప్లేస్ ఆఫ్ ది వార్ కూడా తగ్గి జస్ట్ ఒక బ్రిడ్జి దాటి వెళితే సరిపోతుంది. మూడో దాంట్లో కాజ్ ఆఫ్ ది వార్ ఇంకా తగ్గింది. భూమి కోసం కొట్టుకున్నారు. ప్లేస్ ఆఫ్ ది వార్ ఇంకా దగ్గరకు వచ్చింది ఆ రెండు రాజ్యాల మధ్యలోనే కొట్టుకున్నారు.

    అది సాధ్యమైనపుడు ఇది ఎందుకు కాదు?

    అది సాధ్యమైనపుడు ఇది ఎందుకు కాదు?

    ఇపుడు కాజ్ ఆఫ్ ది వార్ ఒక కలర్ పేపర్. కొందరు దాన్ని రూపీ అంటారు, మరికొందరు డాలర్ అంటారు. ప్లేస్ ఆఫ్ ది వార్ నీలోకే వచ్చేసింది. ఇవన్నీ సాధ్యం అయినపుడు 5 రూపాయల కోసం హత్య ఎందుకు సాధ్యం కాదు... అని త్రివిక్రమ్ క్లాస్ పీకాడు.

    ఇవి చాలా స్టుపిడ్ అనిపిస్తాయి

    ఇవి చాలా స్టుపిడ్ అనిపిస్తాయి

    కాజ్ ఆఫ్ ది వార్ అనేది అలానే ఉంటుంది. ఇది ఆ ప్రాంతానికే పరిమితం కాదు. ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందిన ప్రజలైనా ఇలాంటి వాటి గురించే కొట్టుకుంటారు. ఇవి చాలా స్టుపిడ్ అనిపిస్తాయి.... అని త్రివిక్రమ్ తెలిపారు.

    ఇండియా-పాక్ వార్ కేవలం కంచె కోసమే

    ఇండియా-పాక్ వార్ కేవలం కంచె కోసమే

    ఇండియా-పాకిస్థాన్ ఎందుకు ఇన్ని సంవత్సరాలు కొట్టుకుంటున్నాయి. ఒక కంచె ఉంటుంది ఇవతలికి జరుపాలని వారు... అవతలికి జరుపాలని మనం. జనరేషన్స్ కొట్టుకుంటాయి. ఇవి ఏ లెవల్ కి వెళ్లిపోతాయంటే దీని కోసం జెండాలు, పాటలు, యూనిఫాంలు, స్వాంతంత్ర్య దినోత్సవాలు వచ్చేసిన తర్వాత కాజ్ గురించి మీరు క్వశ్చన్ కూడా చేయరు. మరిచిపోతాం. ఇవి రెండూ ఒకప్పుడు ఒకటే ప్రాంతం. ఇప్పటికీ మీరు ఇంట్లో రాత్రి పూట ఏదైనా బాధ వస్తే రాజ్ కపూర్ పాట, దిలీప్ కుమార్ పాట.... వీళ్లందరూ పెషావర్లో పుట్టి పెరిగినవారు. నిజానికి వీళ్లు పాకిస్థానీలు, ఇండియన్సే కాదని త్రివిక్రమ్ వ్యాఖ్యానించారు.

    ఎన్టీఆర్ ఫిదా

    ఎన్టీఆర్ ఫిదా

    త్రివిక్రమ్ చెప్పిన విషయానికి ఎన్టీఆర్ ఫిదా అయిపోయి... చూశారా మీకు ఒక క్వశ్చన్‌ వేస్తే ఎన్ని సమాధానాలు వచ్చాయో? అంటూ యాంకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

    English summary
    Director Trivikram Mind Blowing Counter To Anchor Shyamala Question about Aravinda Sametha movie. Aravindha Sametha Veera Raghava produced by S. Radha Krishna on Haarika & Hassine Creations banner and directed by Trivikram Srinivas. The film stars N. T. Rama Rao Jr., Pooja Hegde and Eesha Rebba in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X