»   » దిల్ రాజు-త్రివిక్రమ్ భారీ మూవీ ప్రకటన, హోల్డ్ లో పవన్ కళ్యాణ్ పేరు?

దిల్ రాజు-త్రివిక్రమ్ భారీ మూవీ ప్రకటన, హోల్డ్ లో పవన్ కళ్యాణ్ పేరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అటు ప్రేమ కథలు ఇష్ట పడే యువతను ఇటు కుటుంబ కథా చిత్రాలను ఇష్ట పడే ప్రేక్షకులను ఆకట్టుకునే విధం గా కథలను రూపొందించుకుని , చక్కటి చిత్రాలను తీయటం లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ది అందెవేసిన చేయి.ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన 'అ.. ఆ ' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే.

ఇదే విషయాన్నీ ప్రస్థావిస్తూ , ఉత్తమ కుటుంబ కథా చిత్రాలను నిర్మించే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు త్రివిక్రమ్ తో ఒక భారీ చిత్రాన్ని ప్రకటించారు. ఒక పెద్ద స్టార్ హీరో తో ఈ చిత్రం ఉంటుంది అని , ఇతర వివరాలను తరువాత ప్రకటిస్తాం అని ఆయన తెలిపారు.

" త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నాకు 'నువ్వే కావాలి' సినిమా రోజుల నుండి మంచి స్నేహం ఉంది. సినిమాల గురించి ఎన్నో విషయాలను చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మా బ్యానర్ లో ఆయన తో ఒక భారీ సినిమా తేయబోతున్నాం " అని అన్నారు.

అ..ఆ చిత్రం విజయం గురించి మాట్లాడుతూ, "జూన్ లో పెద్ద సినిమా సక్సెస్ అయిన చరిత్ర లేదు. అటువంటి ట్రెండ్ ని కూడా ఈ చిత్రం బ్రేక్ చేసింది. కేవలం ఒక వారం లో డిస్ట్రిబ్యూటర్ ల కు డబ్బులు తిరిగి రావటం అనేది ఈ మధ్య కాలం లో ఏ సినిమా కి జరగలేదు. ఇంతటి విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ కి , మా ప్రొడ్యూసర్ చినబాబు గారికి నా అభినందనలు" అని అన్నారు. ఈ నూతన చిత్రం వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తెలిపింది.

హీరో పవన్ కళ్యాణేనా?

హీరో పవన్ కళ్యాణేనా?

ఈ సినిమాలో హీరో ఎవరు అనేది ఇంకా ప్రకటించక పోయినా పవన్ కళ్యాణే అని అంటున్నారు.

మాటిచ్చాడు

మాటిచ్చాడు

పవన్ కళ్యాణ్ దిల్ రాజు బేనర్లో ఓ సినిమా చేస్తానని గతంలో మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఏది నిజం?

ఏది నిజం?

అయితే అదే ఈ సినిమా అయి ఉంటుందా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు త్రివిక్రమ్ తో కూడా పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయబోతున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.

హోల్డ్ లో పవన్ కళ్యాన్ పేరు?

హోల్డ్ లో పవన్ కళ్యాన్ పేరు?

అయితే స్క్రిప్టు ఇంకా పూర్తి స్థాయిలో రెడీ కాక పోవడం వల్ల కావాలని హీరో పేరు ప్రకటించలేదని అంటున్నారు. అన్నీ ఖరారైన తర్వాతే పవన్ కళ్యాణ్ పేరును ప్రకటించే అవకాశం ఉంది.

English summary
Trivikram - Dil Raju Big Budget Film Announced today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu