పవన్‌ 'కోబలి' కి దర్శకుడు ఖరారు...డిటేల్స్

By Srikanya

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ హీరోగా 'కోబలి' అనే చిత్రం రూపొందనుందంటూ ఆ మధ్యన వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడా వార్తలు నిజ రూపం దాలుస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు ఖరారు అయ్యారు. పవన్ కి ఇష్టమైన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు.

ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ హీరోగా గా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఆ తరవాత పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ సంస్థ నిర్మించే చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తారని సమాచారం. పవన్‌ హీరోగా చేసే ఈ సినిమాకి 'కోబలి' అనే పేరు పరిశీలనలో ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

ఇక పవన్,త్రివిక్రమ్ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ యూరఫ్ లో ప్లాన్ చేసారు. జూన్ మొదటి వారంలో అక్కడ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. మొత్తం 25 రోజుల పాటు వివిధ లోకేషన్లలో అక్కడ షూటింగ్ జరుపాలని నిర్ణయించారు. ఈ మేరకు యూరప్ లోని లొకేషన్ల గురించి ఆరా తీస్తున్నారు. రొటీన్ లొకేషన్లు కాకుండా సరికొత్త లొకోషన్లపై దృష్టి సారించారు. ఇక్కడ కొన్ని సీన్లను చాలా స్టైలిష్‌గా, గ్రాండ్‌గా పిక్చరైజ్ చేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు 7వ తేదీన సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X