త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మరోసారి!
హైదరాబాద్ : అతడు, ఖలేజా సినిమాల తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి త్రివిక్రమ్ దర్వకత్వంలో చేయబోతున్నారు. అయితే ఇది సినిమా మాత్రం కాదు. ఓ యాడ్ ఫిల్మ్ కోసం మహేష్-త్రివిక్రమ్ కలిసి పని చేయబోతున్నారు. మహేష్ బాబు ప్రముఖ కార్పొరేట్ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా'కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ యాడ్ ఫిల్మ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనుంది.
ఇందుకు గాను మహేష్ బాబుతో రూ. 4 కోట్ల డీల్ కుదుర్చుకుందని సమాచారం. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో కూడా మహేష్ బాబు రేంజిలో యాడ్ ఫిల్మ్స్ ద్వారా సంపాదించడం లేదు. ఇటు కమర్షియల్ యాడ్లలో...మరో వైపు సినిమాల్లో సూపర్ స్టార్‌గా కొనసాగుతూ చేతి నిండా సంపాదిస్తున్నాడు.
ప్రస్తుతం మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నారు. మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నారు.
ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవలే 'జులాయి' చిత్రంతో సూపర్ హిట్ కొట్టి....నెక్ట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మరో సినిమాకు రెడీ అవుతున్నారు. అదే విధంగా రామ్ చరణ్ తో కూడా మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ఈ క్రేజీ దర్శకుడు.


Click it and Unblock the Notifications











