దర్శకుడు త్రివిక్రమ్ టెన్షన్.. టెన్షన్!
టాప్ దర్శకులు రాజమళి, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల లాంటి వాళ్ల దగ్గర నుంచి చిన్నా చితకా దర్శకుల వరకు తాము తీసే చిత్ర్రం ప్రేక్షకాదరణ పొందుతుందనే ఆశతోనే మొదలు పెడతారు. అయితే అన్ని సార్లు వాళ్లు అంచనాలను చేరుకోలేదు. ఎంతో కష్టపడి తీసిన సినిమాలు, సూపర్ హిట్ అవుతాయనే నమ్మకం ఉన్న కాన్సెప్టులు, కథలు చాలా సందర్భాల్లో బాక్సాఫీసు వద్ద బొల్తా పడుతూ ఉంటాయి.
దర్శకుడు త్రివిక్రమ్ విషయానికొస్తే...మంచి టాలెంట్ ఉన్న మాటల రచయితగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ అదే కాన్ఫిడెన్స్‌తో దర్శకత్వంలోకి దిగారు. తన మాటల మాయతో, మంచి స్క్రీన్ ప్లేతో సినిమాను నెగ్గుకురాగల సత్తా ఉన్నోడని పేరు తెచ్చుకున్నాడు. పవన్ జల్సా చిత్రం త్రివిక్రమ్ రేంజి పెంచింది.
అయితే అన్ని సార్లు విజయం మనవెంటే ఉండదు. త్రివిక్రమ్ గత సినిమా 'ఖలేజా' పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఆ చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ తాజాగా 'జులాయి' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంత గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ సినిమా ఏ రేంజిలో ఉంటుందో అని సినీ జనాలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ దర్శకుడికైనా పరీక్షా కాలమే. దీంతో సినిమా భవిష్యత్ ఏమిటో అని చాలా టెన్షన్ గా ఉన్నాడట త్రివిక్రమ్.
అల్లు అర్జున్, ఇలియాన జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'జులాయి' చిత్రాన్ని జులై 13న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఈచిత్రానికి సంబంధించిన ప్లాటినమ్ డిస్క్ వేడుకను జులైన 8న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సమర్పణ: డివివి దానయ్య, నిర్మాత: ఎన్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











