»   » పవన్ కళ్యాణ్ చాలా చిక్కిపోయాడు.... (లీక్డ్ ఫోటోస్)

పవన్ కళ్యాణ్ చాలా చిక్కిపోయాడు.... (లీక్డ్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ స్పాట్ నుండి కొన్ని ఫోటోస్ లీక్ అయ్యాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ న్యూ లుక్ తో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. గత చిత్రంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ చాలా సన్నబడ్డారు.

విమర్శలకు చెక్ పెడుతూ...

విమర్శలకు చెక్ పెడుతూ...

ఇంతకు ముందు వచ్చిన రెండు చిత్రాల్లో పవన్ కళ్యాణ్ కాస్త లావెక్కి కనిపించారు. దీంతో పవన్ కళ్యాణ్‌‌లో లుక్ పరంగా అట్రాక్షన్ తగ్గిపోయిందనే విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో న్యూ లుక్ తో కనిపించబోతున్నారు.

చాలా కష్టపడ్డారు

చాలా కష్టపడ్డారు

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించబోతున్నారు. పాత్రకు తగిన విధంగా యంగ్ లుక్ తో కనిపించాలని దర్శకుడు త్రివిక్రమ్ చెప్పడంతో చాలా కష్టపడి వర్కౌట్ చేయడంతో పాటు డైట్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట.

లుక్స్ చాలా ఇంపార్టెంట్

లుక్స్ చాలా ఇంపార్టెంట్

అత్తారింటికి దారేది మూవీలోని పవన్ లుక్‌లా కనిపించాలి అని త్రివిక్రమ్ ఒత్తిడి చేసి మరీ పవన్ ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చేయించారట. షూటింగ్ జరిగినన్ని రోజులు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే వైట్ రైస్ లేకుండా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారమే తీసుకున్నాడట పవన్.

యాక్షన్ సీక్వెన్స్

యాక్షన్ సీక్వెన్స్

ప్రస్తుతం సారథి స్టూడియోస్ లో సూపర్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించే పనిలో ఉంది సినిమా యూనిట్. ఇక్కడ సినిమా షూటింగ్ కోసం ఇరానీ కేప్ సెట్స్ వేశారు. ఆ సెట్లోనే షూటింగ్ జరుగుతుంది. సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యువెల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.

గత జన్మలో పవన్ కళ్యాణ్ హత్య చేయబడ్డాడా?

గత జన్మలో పవన్ కళ్యాణ్ హత్య చేయబడ్డాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత జన్మలో రాజుగా జన్మించారని, అయితే ఆయన ఆ జన్మలో హత్య చేయబడ్డాడని ఓ జ్యోతిష్య్కుడు చెప్పాడు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

త్రివిక్రమ్ నూతన గృహప్రవేశం, పవన్ కళ్యాణ్ హాజరు... ఫోటోలు వైరల్?

త్రివిక్రమ్ నూతన గృహప్రవేశం, పవన్ కళ్యాణ్ హాజరు... ఫోటోలు వైరల్?

త్రివిక్రమ్ నూతన గృహప్రవేశం, పవన్ కళ్యాణ్ హాజరు అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోటోలు ఫోటోలు వైరల్ అయ్యాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Pawan Kalyan New Avatar for Trivikram Movie. Pawan kalyan transferred in to slim look. Now, latest reports suggest that shoot of the film is taking place at Saradhi Studios in Hyderabad and the unit is canning a high-octane action sequence with a number of fighters on the backdrop of Irani hotel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu