పవన్ కళ్యాణ్ నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ప్రత్యేక గిప్ట్
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ కి దర్శక, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాసిన సంగతి తెలిసిందే. ఈ మాటలు చాలా బాగా నచ్చాయంటూ పవన్ మెచ్చుకుని రీసెంట్ గా ఆయనకి శ్యామ్ సంగ్ టాబ్లెట్ (మొబైల్) ని గిప్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మొదటి వారంలోనే ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్ వసూలు అయ్యింది కాబట్టి కూల్ గా తదుపరి సినిమాపై దృష్టి పెడుతున్నట్లు పవన్ వ్యాఖ్యానించినట్లు అంటున్నారు. అంతలా జనాలకి నచ్చటానకి కారణం త్రివిక్రమ్ డైలాగ్స్ అని మెచ్చుకున్నాడని తెలుస్తోంది. ఇక త్రిష,పవన్ కాంబినేషన్ లో జయింత్ రూపొందించిన ఈ చిత్రం కలెక్షన్స్ రోజు రోజుకీ డ్రాప్ అవుతున్నాయి. మిస్టర్ ఫెరఫెక్ట్ రిలీజ్ అయ్యాక మరీ తగ్గిపోవటం అన్ని ధియోటర్స్ లోనూ కనపడుతోంది. దానికి తోడు నిర్మాత గణేష్ కానీ, పవన్ కానీ రిలీజ్ అయ్యాక ప్రమోషన్ అస్సలు పట్టించుకోవటం లేదు.


Click it and Unblock the Notifications











