పవన్ పార్టీ....అల్లు అర్జున్ కి సమస్య

రేసు గుర్రం తర్వాత గోపీచంద్ మలినేనితో పండుగ చేస్కో చిత్రం చేయటానికి స్క్రిప్టు వర్క్ జరిగింది. అయితే త్రివిక్రమ్ తో ఓకే చేయటంతో అదిప్పుడు రామ్ దగ్గరకి వెళ్లింది. అటు హరీష్ శంకర్ చిత్రమూ రిజెక్టు చేసారు. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ చిత్రం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్. అయితే ఎలక్షన్స్ అయ్యేదాకా త్రివిక్రమ్ ఖాళీ పడేటట్లు లేరు. అంటే ఎలక్షన్స్ అయ్యాక గానీ బన్నీ కొత్త చిత్రం ప్రారంభం కాదన్నమాట. సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంపై అభిమానులు భారీగానే అంచనాలు పెంచుకొంటున్నారు.
దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇదివరకు 'జులాయి'కి కూడా ఈయనే స్వరాలు సమకూర్చారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కబోతోంది. ఇందులో అల్లు అరవింద్ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరినట్టు సమాచారమ్. మరో ప్రక్క అల్లుఅర్జున్ 'రేసుగుర్రం' తుదిదశకు చేరుకొంది.
'రేసు గుర్రం' చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. సంక్రాంతికి విడుదల అవుతుందనుకున్న ఈ చిత్రం పిభ్రవరికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే విడుదల తేదీ ని ఏప్రియల్ 4 వ తేదీకి మార్చారని తెలుస్తోంది. పూర్తై ఫస్ట్ కాపీ పట్టటానికి ఇంకా రెండు నెలలు సమయం పట్టేటట్లు ఉందని అందుకే విడుదల ను ముందుకు నెట్టారని చెప్తున్నారు. చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉండబోతోందని దర్శకుడు చెప్తున్నాడు. ఫన్,యాక్షన్ కలిపి మరో కిక్ లా రూపొందిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











