ఈసారి త్రివిక్రమ్ కన్ను దానిపై పడిందట: ఎన్టీఆర్‌ను ఏం చేస్తాడో?..
Recommended Video

అజ్ఞాతవాసి ఎఫెక్ట్ త్రివిక్రమ్ పై తీవ్ర ప్రభావం చూపించింది. ఇలా కాపీ చేసి దొరికిపోతే ఎలా గురూజీ అంటూ ఆయన ఫ్యాన్స్ సైతం సెటైర్స్ వేశారు. ఇదొక్కటేనా.. ఆయన గత సినిమాల్ని కూడా బయటకు తవ్వి.. హాలీవుడ్ లో వాటి మూలాలు ఎక్కడెక్కడున్నాయో పట్టేశారు. దీంతో ఇన్నాళ్ల త్రివిక్రమ్ ఇమేజ్ కు కాస్త డ్యామేజ్ జరిగిందనే చెప్పాలి. వీటన్నింటి దృష్ట్యా త్రివిక్రమ్ కూడా ఇక కథల విషయంలో సొంత తెలివి కంటే.. రచయితల సహాయం తీసుకోవడమే బెటర్ అనుకుంటున్నారట..

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో టెన్షన్
'అజ్ఞాతవాసి' పవన్ కల్యాణ్ అభిమానులను ఎంత నిరాశపరిచిందో.. ఎన్టీఆర్ అభిమానులను అంతే ఆందోళన చెందేలా చేసింది. ఎందుకంటే.. త్రివిక్రమ్ తదుపరి చిత్రం జూ.ఎన్టీఆర్ తోనే కాబట్టి.. ఎక్కడ తమ హీరోకు కూడా మరో ఫ్లాప్ మూటగట్టిస్తాడేమోనని వాళ్లు ఆందోళన చెందుతున్నారు.

సబబు కాదనుకున్న ఎన్టీఆర్..
అటు ఎన్టీఆర్ సైతం త్రివిక్రమ్‌తో మూవీకి కాస్త తటపటాయిస్తున్నాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఒక్క సినిమాతోనే త్రివిక్రమ్ టాలెంట్‌ను తీసిపారేయడం సబబు కాదన్న ఉద్దేశంతో ఆయనతో సినిమా చేయడానికే ఎన్టీఆర్ మొగ్గుచూపుతున్నట్లు తాజాగా ఫిలింనగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

'మధుబాబు' కథపై త్రివిక్రమ్ కన్ను..:
అజ్ఞాతవాసి లాంటి భారీ డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. మరోసారి తనను తాను నిరూపించుకోవాలన్న కసి మీద ఉన్నారు త్రివిక్రమ్. అందుకే ఈసారి కథ విషయంలో తాను పెన్ను పట్టడం లేదట.
తెలుగులో డిటెక్టివ్ నవలలకు కేరాఫ్ అయిన 'మధుబాబు' రచనల నుంచి కథ తీసుకుంటున్నట్లు టాక్. ఇప్పటికే మధుబాబు రాసిన ఓ డిటెక్టివ్ నవలా కథను త్రివిక్రమ్ ఫైనల్ చేసుకున్నారని తెలుస్తోంది.

గతంలోనూ త్రివిక్రమ్ ఇలాగే..:
నవలా కథాంశాలతో త్రివిక్రమ్ సినిమా తీయడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో 'అతడు' సినిమాలోనూ మధుబాబు నవలలోని కొన్ని సన్నివేశాలను ఆయన వాడుకున్నారు. అలాగే యుద్దనపూడి సులోచనరాణి రాసిన ఓ నవలా కథాంశంతోనే నితిన్‌తో 'అ..ఆ..' సినిమా తెరకెక్కించారు.

మధుబాబుకు క్రెడిట్ ఇస్తారా?:
గతంలో 'అ.. ఆ..' సినిమా సమయంలో త్రివిక్రమ్ పై చాలానే విమర్శలు వచ్చాయి. రచయిత్రి యుద్దనపూడి కథను సినిమా కోసం వాడుకుని ఆమెకు క్రెడిట్ ఇవ్వకపోవడంతో త్రివిక్రమ్ ను చాలామంది తప్పుపట్టారు. ఆ తర్వాత కానీ త్రివిక్రమ్ ఆమెకు క్రెడిట్ ఇవ్వలేదు.
అయితే ఈసారి అలా కాకుండా.. నిజాయితీగా వ్యవహరించాలని భావిస్తున్నారట త్రివిక్రమ్. మధుబాబు నుంచే నేరుగా హక్కులు సొంతం చేసుకుని సినిమా తీయాలనుకుంటున్నారట. మరి ఆన్ స్క్రీన్ మధుబాబుకు క్రెడిట్ ఇస్తాడో లేడో అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు.

ఎన్టీఆర్‌తో యాక్షన్ థ్రిల్లర్:
ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాను త్రివిక్రమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా మలచబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గతేడాది నవంబరులో లాంఛనంగా ఫ్రారంభం అయిన సంగతి తెలిసిందే. గతేడాది త్రిపాత్రిభినయంతో 'జై లవకుశ' హిట్ కొట్టిన ఎన్టీఆర్ ను ఈసారి త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నాడో!. ఏదేమైనా ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కడం త్రివిక్రమ్ కు అనివార్యం.


Click it and Unblock the Notifications











