twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ మూవీపై పుకార్లు ప్రచారం చేయొద్దు: త్రివిక్రమ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'జల్సా' మూవీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో భారీ అంచనాలతో ఓ చిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంపై ఇప్పటికే రకరకాల టైటిల్స్ ప్రచారంలో వచ్చాయి. 'హరే రామ హరే కృష్ణ' అనే టైటిల్' ఖరారు చేసే ఆలోచనలో ఉందనే వార్తలు ఈ మధ్య వెబ్ లో హల్ చల్ చేస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో దర్శకుడు త్రివిక్రమ్ స్పందించారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని, ప్రస్తుతం స్క్రిప్టుకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే టైటిల్ ఖరారు చేస్తామని చెప్పిన త్రివిక్రమ్, అప్పటి వరకు టైటిల్ విషయంలో ఎలాంటి వార్తలు ప్రచారం చేయవద్దని రిక్వెస్ట్ చేసారు.

    అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ 'హరే రామ హరే కృష్ణ' టైటిల్ విషయాన్ని మాత్రం ఖండించలేదు. దీన్ని బట్టి ఆయన ఈ టైటిల్ పరిశీలీనలో ఉంచారని, వీలైతే దీన్ని ఓకే చేసే అవకాశం ఉందని కూడా స్పష్టం అవుతోంది. ఏది ఏమైనా త్రివిక్రమ్ నుంచి అఫీషియల్ సమాచారం అందే వరకు ఏ విషయాన్ని నమ్మకూడదనే అర్థం చేసుకోవాలి.

    ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. వరుసగా పెద్ద హీరోలు, పెద్ద దర్శకుల చిత్రాల్లో నటిస్తూ హిట్స్ కొడుతున్న సమంత ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన దాదాపుగా ఖరారైనట్లే.

    English summary
    Trivikram has clarified on Pawan Kalyan movie. he hasn’t even thought about the title of the film so far. He is currently giving finishing touches to the script. He will announce the title himself once it’s finalized.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X