బుల్లితెరపై...జూ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్

By Bojja Kumar

జూ ఎన్టీఆర్ ఎట్టకేలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. అయితే ఇది సినిమా కోసం మాత్రం కాదు, ఇంతా ఓ టీవీ యాడ్ కోసమే. జూనియర్ ఎన్టీఆర్ నవరత్న్ కూల్ టాల్క్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వేసవికిగాను కొత్త యాడ్ చిత్రీకరిస్తున్నారు. ఈ యాడ్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో ఈ యాడ్‌ను రాజమౌళి దర్శకత్వంలో రూపొందించారు. యాడ్ ఫిల్మ్ రూపొందించడంలో త్రివిక్రమ్‌కు మంచి అనుభవం ఉంది. రామ్ చరణ్, ధోనీలతో రూపొందించిన థమ్సప్ యాడ్ అప్పట్లో బాగా పాపులర్ అయింది.

జూ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తే బాగుండని అభిమానులు చాలా కాలంగా ఆశ పడుతున్నారు. అదిరిపోయే డైలాగులు, ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో సాగే త్రివిక్రమ్ సినిమాలంటే ఇష్టపడనివారు ఉండరు. జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్ వెండితెరపైకి రావాలని అంతా కోరుకుంటున్నారు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో త్రిష, కార్తీకలు హీరోయిన్లుగా అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న 'దమ్ము' చిత్రంలో నటిస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్...అల్జు అర్జున్-ఇలియానా జంటగా డివివి దానయ్య నిర్మాణ సారథ్యంలో 'జులాయి' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X