తొడగొట్టడం పాత పద్దతి.... కొత్త స్టైల్ పరిచయం చేసిన త్రివిక్రమ్!
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' చిత్రం ఇప్పటి వరకు వచ్చిన ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ ఉన్న సినిమాకు భిన్నంగా ఉందని, గొడవల్లో కత్తులతో నరుక్కునే సీన్లను కూడా రీటీన్‌గా కాకుండా డిఫరెంటుగా ప్రజెంట్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
దర్శకుడు త్రివిక్రమ్‌కు యంగ్ టైగర్‌తో ఇది మొదటి సినిమా. అదే సమయంలో ఆయన చేసిన తొలి ఫ్యాక్షన్ మూవీ ఇది. అందుకే సినిమాతో పాటు తారక్‌ను కూడా విభిన్నంగా చూపించే ప్రయత్నం చేశాడు. సాధారణంగా ఫ్యాక్షన్ సినిమాలంటే తొడగొట్టడం లాంటివి కనిపిస్తాయి. ఇందులో అలాంటి రోటీన్ సీన్లు కనిపించకుండా త్రివిక్రమ్ జాగ్రత్త పడ్డాడు.
నెత్తురు కత్తి తొడకి అద్దడం కొత్త పద్దతి
తొడ కొట్టడం పాత పద్ధతి నెత్తురు కత్తి తొడకి అద్దటం కొత్త పద్ధతి... అంటూ ఎన్టీఆర్, త్రివిక్రమ్ అభిమానులు సినిమాను ఆస్వాదిస్తున్నారు.
ఫ్యాన్స్ మధ్య హాట్ డిస్క్రీషన్
రక్తం అంటిన కత్తిని తొడకు తుడచుకోవడం చాలా విభిన్నంగా ఉందని, గతంలో ఏ దర్శకుడు ఇలాంటి డిఫరెంట్ ఆలోచన చేయలేదని అంటున్నారు.
ఈ మాస్ సీన్స్ అన్నీ ఎక్కడ దాచావయ్యా?
గూరూజీ ఈ మాస్ సీన్స్ అన్నీ ఇన్ని రోజులు ఎక్కడ దాచావయ్యా? మాస్ హీరో పడేంత వరకు నీ నుండి ఈ మాస్ యాంగిల్ బయటకు రాలేదు.... అంటూ త్రివిక్రమ్ టేకింగ్ మీద అభిమానులు పొగడ్తలు గుప్పిస్తున్నారు.
త్రివిక్రమ్ డైలాగులకు అద్భుతమైన రెస్పాన్స్
త్రివిక్రమ్ డైలాగులకు అద్భుతంగా ఉన్నాయని, సినిమా ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ మరింత హైలెట్ అయ్యేలా ఉందని అభిమానుల నుండి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











