పవన్ సినిమాలో త్రివిక్రమ్ నటించడం లేదు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేసన్లో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'సరదా'(తాత్కాలిక టైటిల్). ఈచిత్రంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అతిథి పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఖండించారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈచిత్రంలో ఎలాంటి అతిథి పాత్ర చేయడం లేదని, ఆయన పవన్ తో పాటు నటిస్తున్నాడన్న వార్తలన్నీ కేవలం కల్పితాలే అని ఆయన స్పష్టం చేసారు. ఇలాంటి వార్తలు ఎలా పుడతాయో? ఎలా ప్రచారంలోకి వస్తాయో అంటూ బివిఎస్ఎన్ ప్రసాద్ విస్మయం వ్యక్తం చేసారు.
సినిమా వివరాల్లోకి వెళితే..
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హాట్ బ్యూటీ సమంత హీరోయిన్ గా ఎంపికయింది. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం ఇటీవలే ఫిల్మ్ నగర్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగింది. ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాక పోయినా తాత్కాలికంగా అంతా 'సరదా' పేరుతో పిలుస్తున్నారు.
త్వరలో టైటిల్ అఫీషియల్‌గా ఖరారు చేసే అవకాశం ఉంది. రెగ్యులర్ షూటింగు మాత్రం డిసెంబర్ నెల నుంచి జరుగుతుందని తెలుస్తోంది. జల్సా తరహాలో ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజం, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయి.


Click it and Unblock the Notifications











