త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబో.. టైటిల్ కూడా మార్చేస్తున్నారట?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ కోసం ఒక కథను రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఎలా ఉంటుందో గాని షూటింగ్ మొదలవ్వకముందే సినిమాకు సంబంధించిన అనేక రకాల వార్తలు అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి. అందులో చాలా వరకు నిజాలని రెగ్యులర్ గా వార్తలు రావడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఇటీవల సినిమాకు సంబంధించిన మరొక రూమర్ కూడా వైరల్ గా మారింది.
ఈ మధ్య కాలంలో ఎక్కువగా త్రివిక్రమ్ అ.. అనే అక్షరం టైటిల్ మొదట్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక సెంటిమెంట్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం కూడా త్రివిక్రమ్ 'అయినను పోయిరావలే' హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ వచ్చింది. నిజానికి ఆ టైటిల్ ని హరికా హాసిని క్రియేషన్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయించింది కూడా. కానీ ఇపుడు ఆ టైటిల్ కథకు సెట్ కావడం లేదని మరో టైటిల్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది..

ముందుగా స్టోరీ లైన్ వినిపించి తారక్ ని ఒప్పించిన త్రివిక్రమ్ కథను డెవలప్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఫస్ట్ హాఫ్ కథపై ఇటీవల తారక్ తో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. ఆల్ మోస్ట్ సెకండ్ హాఫ్ కూడా అయిపోయిందట. ఆ సమయంలోనే టైటిల్ ని మార్చాలని త్రివిక్రమ్ కి ఆలోచన వచ్చినట్లు టాక్. ఇక సినిమాను పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. RRR సినిమా అనంతరం తారక్ త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











