»   » షాకింగ్ లుక్: ఎన్టీఆర్ ఇంత సన్నబడ్డాడేంటి? త్రివిక్రమ్ ఏంటయ్యా ఇది....

షాకింగ్ లుక్: ఎన్టీఆర్ ఇంత సన్నబడ్డాడేంటి? త్రివిక్రమ్ ఏంటయ్యా ఇది....

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీలో ‘సాహో’ హీరోయిన్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా కమిటైన సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. గతేడాది చివర్లోనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభం అయింది. అయితే ఈ సినిమాలోని పాత్ర కోసం ఎన్టీఆర్ తన లుక్ పూర్తిగా మార్చుకోవాల్సి ఉండటంతో షూటింగ్ ప్రారంభం అవ్వడానికి సమయం తీసుకుంటున్నారు. త్రివిక్రమ సూచనల మేరకు స్లిమ్ లుక్‌లో త్వరలో ఎన్టీఆర్ దర్శనమివ్వబోతున్నాడు.

 ఎన్టీఆర్ ఫోటో లీక్, అంతా షాక్

ఎన్టీఆర్ ఫోటో లీక్, అంతా షాక్

తాజాగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ ఫోటో ఇంటర్నెట్లో లీక్ అయింది. ఇందులో ఎన్టీఆర్ మామూలుగా ఉండాల్సిన దానికంటే చాలా సన్నగా ఉండటంతో అభిమానులు షాకవుతున్నారు.

 త్రివిక్రమ్ ఏంటయ్యా ఇది...

త్రివిక్రమ్ ఏంటయ్యా ఇది...

గత రెండు మూడు సినిమాల్లో ఎన్టీఆర్ ఉండాల్సినంత బరువు, మంచి పర్సనాలిటీతో పర్ఫెక్ట్‌గా కనిపించాడు. అయితే త్రివిక్రమ్ తన సినిమాలోని పాత్ర కోసం అంటూ ఎన్టీఆర్‌ను సన్నబడాలని కోరడం, సినిమాలోని పాత్ర పర్ఫెక్షన్ కోసం ఎంతకైనా తెగించే ఎన్టీఆర్ కూడా.... అతడి సూచనల మేరకు చాలా సన్నబడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కొందరు అభిమానులైతే... ఏంటయ్యా త్రివిక్రమ్, మా హీరోను ఏం చేయబోతున్నావ్ అంటూ.... కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 ఆరోగ్యం జాగ్రత్త అంటూ సూచలు

ఆరోగ్యం జాగ్రత్త అంటూ సూచలు

సినిమా మీద ఫ్యాషన్‌తో ఎన్టీఆర్ ఇలా తిండి తిప్పలు మానేసి తీవ్రమైన జిమ్ వర్కౌట్లు చేస్తూ అతి తక్కువ కాలంలోనే సన్నబడుతుండటంతో, ముఖంలో కాస్త గ్లామర్ తగ్గినట్లు ఉండటంతో అభిమానుల్లో ఆందోళన, అనుమానాలు మొదలయ్యాయి. తమ అభిమాన హీరోకు ఆరోగ్యం జాగ్రత్త అంటూ సూచనలు చేస్తున్నారు.

 లాయిడ్‌ స్టీవెన్స్

లాయిడ్‌ స్టీవెన్స్

ఎన్టీఆర్ ఈ లుక్‌లోకి రావడం కోసం జిమ్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్ స‌మ‌క్షంలో ఎన్టీఆర్ కొన్న రోజులుగా ట్రైనింగ్ అవుతున్నాడు. అయితే ఎన్టీఆర్ సన్నబడిన తర్వాత ముఖం కాల పేలగా తయారైందనే ఆందోళన అభిమానుల్లో వ్యక్తం అవుతోంది.

 టైటిల్ ఇదేనా?

టైటిల్ ఇదేనా?

కాగా... ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీకి టైటిల్ ఇదే అంటూ ఓ టైటిల్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు ‘ఆన్ సైలెంట్ మోడ్' అనే టైటిల్ పెట్టినట్టుగా పుకారు షికారు చేస్తోంది. ఈ టైటిల్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించినట్లు సమాచారం.

 సినిమా కాన్సెప్టు ఏమిటి?

సినిమా కాన్సెప్టు ఏమిటి?

ఈ సినిమా కాన్సెప్టు ఏమిటి? కథ ఏమిటి అనే వివరాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే ఇది ఎమోషనల్ ఫ్యామిలీ అండ్ లవ్ స్టొరీగా ఉంటుందని టాక్. త్రివిక్రమ్ స్టైల్ ఈ చిత్రం ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఉండబోతోందట.

 హీరోయిన్ ఎవరు?

హీరోయిన్ ఎవరు?

హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్‌ని క‌థానాయిక‌గా తీసుకోవాల‌ని భావిస్తున్నారు. ఈ నెల చివర్లో లేదా? ఏప్రిల్‌లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

English summary
A photograph that is doing rounds on social media indicates that NTR Jr has lost all the chubbiness in his face. Gone is the bloated appearance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu