అల్లు అర్జున్, ఇలియానా కాంబినేషన్ లో ఆ దర్శకుడు కన్ఫర్మ్

By Srikanya

త్రివిక్రమ్ శ్రీనివాస్,వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం కాన్సిల్ అయింది. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి అల్లు అర్జున్ వచ్చి చేరాడు. త్రివిక్రమ్ చెప్పిన కథ విని అల్లు అర్జున్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. పెళ్ళి హడావిడిలో ఉన్నా సమయం కేటాయించుకుని స్క్రిప్టు మొత్తం వినటం జరిగింది. ఇక ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిచనున్నారు. వచ్చే నెలలో ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఇక వెంకటేష్ తన సినిమా విషయంలో ఏ నిర్ణయం తీసుకోకుండా నార్చడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందులోనూ వెంకటేష్ మళయాళంలో విజయవంతమైన బాడీగార్డు రీమేక్ కు పచ్చ జెండా ఊపారు. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా డాన్ శ్రీను డైరక్టర్ గోపీచంద్ మలినేని ఈ చిత్రం దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా ప్లాప్ తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న చిత్రం ఇదే. రొమాంటిక్ కామిడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. నిర్మాత దానయ్య విషయానికి వస్తే గతంలో అల్లు అర్జున్ తో దేశముదురు వంటి హిట్ ఇచ్చారు. ఆ తర్వాత అదే అల్లు అర్జున్ తో గుణశేఖర్ దర్శకత్వంలో వరుడు వంటి డిజాస్టర్ చిత్రాన్ని సైతం ఇచ్చారు. ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా ఇలియానా ను ఎంపికచేసారు. ఇలియానా ఇంతకుముందు త్రివిక్రమ్ తో జల్సాలో చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X