త్రివిక్రమ్..'ఖలేజా' అనంతరం చేయబోయే చిత్రం
త్రివిక్రమ్ తాజా చిత్రం "ఖలేజా" అక్టోబర్ ఏడున విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత ఆయన ఏం చేయబోతున్నారనేది అందరికీ ఆసక్తే. అయితే ఆయన వెంకటేష్ తో సినిమా కమిటయ్యారని సమాచారం. త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ లో గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలు వచ్చి హిట్టయ్యాయి. అయితే అప్పుడు రైటర్ గా త్రివిక్రమ్ ఆ చిత్రాలకు పనిచేసారు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకుడుగా, వెంకటేష్ తో చిత్రం ఓకే చేయించుకున్నారు. ఖలేజా రిలీజ్ అనంతరం ఆ ప్రాజెక్టు కు సంభందించిన పనులు పూర్తవుతాయి.ఇక రీసెంట్ గా ఈ చిత్రానికి సంభందించిన సబ్జెక్టు ఫైనల్ అయ్యింది. ఈ చిత్రం యూనవర్శిల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తారు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్.. ఖలేజా రిలీజ్ హడావిడిలో ఉన్నారు. వెంకటేష్..చంద్రముఖి సీక్వెల్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దానయ్య...అల్లు అర్జున్ తో చేసిన వరుడు తర్వాత ఈ ప్రాజెక్టునే ప్రారంభించనున్నారు.


Click it and Unblock the Notifications











