»   » హాట్ న్యూస్ :త్రివిక్రమ్-నితిన్ చిత్రం టైటిల్ ఖరారు

హాట్ న్యూస్ :త్రివిక్రమ్-నితిన్ చిత్రం టైటిల్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ నితిన్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ ' బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి టైటిల్ ఖరారు అయ్యింది. "అ...ఆ" ...ట్యాగ్ లైన్ గా .. "అనసూయ రామలింగం వెర్శస్ ఆనంద్ విహారి " అని ఫిక్స్ చేసినట్లు నిర్మాత మీడియాకు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో తెలియచేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

 Trivikram - Nithiin's title A..Aa

ఇక ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా సమంత, మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ (ప్రేమమ్ ఫేమ్ మళయాళి భామ) చేస్తోంది. . ఈ నిర్మాతతో త్రివిక్రమ్ కు ఇది మూడో సినిమా. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత ఈ నిర్మాత చేస్తున్న చిత్రం ఇదే. సెప్టెంబర్ మూడవ వారం నుంచి ఈ చిత్రం మొదలుకానుంది. సంక్రాంతికి కు విడుదల చేస్తారు.

ఈ చిత్రం కు సౌండ్ డిజైనర్ గా విష్ణు గోవింద్, శ్రీ శంకర్ పనిచేయనున్నారు. సంగీతం అనిరుధ్, సినిమాటోగ్రఫి నటరాజ్ సుబ్రమణ్యన్, ఆర్ట్ రాజీవన్, ఎడిటింగ్ ...కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...పిడివి ప్రసాద్. ఈ సినిమాని శ్రీమతి మమత సమర్పిస్తున్నారు.

English summary
Noted director Trivikram, is going to make a movie under the banner of 'Haarika and Hassine Creations', and he titled the film as "A...Aa" , the film has a tag line "Anasuya Ramalingam Versus Anand Vihari",
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu