»   » స్టార్లను పక్కన పెట్టిన త్రివిక్రమ్, రూటు మార్చాడా?

స్టార్లను పక్కన పెట్టిన త్రివిక్రమ్, రూటు మార్చాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు స్టార్ డైరెక్టర్లలో ఒకరైన దర్శకుడు త్రివిక్రమ్ దాదాపు టాప్ పొజిషన్లో ఉన్న హీరోలతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు మొదటి నుండీ. దర్శకుడిగా తన తొలి సినిమా తరుణ్ హీరోగా ‘నువ్వే నువ్వే' తప్ప మిగతా వన్నీ ఆయన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో చేసినవే. ఈ ముగ్గురు హీరోలతో రెండేసి సినిమాలు చేసాడు త్రివిక్రమ్.

చాలా కాలం తరువాత త్రివిక్రమ్ రూటు మార్చారు. నితిన్ లాంటి మధ్య స్థాయి స్టార్ హీరోగా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. సాధారణంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అనగానే పెద్ద స్టార్స్, భారీ తారాగణం, దేవిశ్రీ ప్రసాద్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు.

Trivikram, Nitin new movie

కానీ నితిన్ హీరోగా తెరకెక్కించబోయే సినిమాకు కోలీవుడ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాటోగ్రాపర్లనే తన సినిమాలకు ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్ ఈ సినిమాకు సౌతిండియాలోని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ తీరు చూస్తుంటే.... ఈ సారి ఆయన తన గత సినిమాలకు పూర్తి భిన్నమైన, రొటీన్ కు భిన్నమైన సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. మణిరత్నం దగ్గర పని చేసిన సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ ఈ మధ్య సినిమాల కంటే డాక్యుమెంటరీలే ఎక్కవగా చేస్తున్నారు. త్రివిక్రమ్ ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నడనే ప్రచారం సాగుతోంది.

English summary
Check out Trivikram, Nitin new movie details.
Please Wait while comments are loading...