'నువ్వు నాకు నచ్చావు'లాంటి కథతో పవన్ కళ్యాణ్
హైదరాబాద్ :పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో జల్సా సినిమా వచ్చి విజయవంతం అయ్యింది. తాజాగా మరో సినిమా తెరకెక్కనుంది. ఈ విషయమై త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియాకు కన్పర్మ్ చేసి చెప్పారు. ఆ సినిమా ఎలా ఉంటుందో ఆయన మాట్లాడుతూ...నువ్వు నాకు నచ్చావు తరహా మానవ సంభంధాలతో ఉంటుందన్నారు.అలాగే తెలుగు సంప్రదాయలు,మానవ భాంధవ్యాలు ప్రధానంగా ఇందులో కనిపించేలా కథను రెడీ చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు అనంతరం ఈ చిత్రం ప్రారంభం అవుతుంది.
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈచిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం సెప్టెంబర్లో మొదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆలోపు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగ్ పూర్తి కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ ఇప్పటికే రెడీ అయింది. త్వరలో త్రివిక్రమ్ స్క్రిప్టు వర్కు మొదలు పెట్టనున్నాడని, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా దీన్ని ప్లాన్ చేస్తుననట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో వెల్లడి కానున్నాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూరి జగన్ దర్శకత్వంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' షూటింగులో బిజీగా గడుపుతుండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తాజా చిత్రం 'జులాయి'కి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్, ప్రమోషన్ వర్కులో మునిగి తేలుతున్నాడు. జులాయి బాధ్యతలు తీరగానే త్రివిక్రమ్ పవన్ సినిమా స్క్రిప్టు వర్కుపై తన పూర్తి సమయం కేటాయించనున్నాడని తెలుస్తోంది. జులాయి చిత్రం రేపు విడుదల కానుంది. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











