»   » 100 కోట్ల బడ్జెట్‌తో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మూవీ?

100 కోట్ల బడ్జెట్‌తో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మూవీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్లు....మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్లో సినిమాలు వస్తే అంచనాలు భారీగా ఉంటాయి, ఈ సినిమాలు మంచి హిట్టయితే రూ. 100 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదిప్పుడు. రూ. 100 కోట్ల పైచిలుకు వసూలు చేసే సత్తా తెలుగు సినిమా పరిశ్రమకు ఉందని ఇటీవల బాహుబలి సినిమాతో తేలిపోయింది. ఆ తర్వాత వచ్చిన కొన్ని టాప్ హీరోల సినిమాలు కూడా రూ. 100 కోట్లకు చేరువకావడం తెలిసిందే.

Also Read: గమ్మునుండవోయ్: మళ్లీ బన్నీని రెచ్చగొట్టిన పవన్ ఫ్యాన్స్...

ఆ మధ్య పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా కూడా రూ. 100 కోట్లకు చేరువలో ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో సినిమా కాస్త నష్టపోయింది కానీ భారీ హిట్టయితే రూ. 100 కోట్లు దాటేవే అనేది ట్రేడ్ విశ్లేషకుల మాట. మంచి కథ కు ఎంటర్టెన్మెంట్ జోడించి....యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులను థియేటర్లకు మెప్పించగలిగితే రూ. 100 కోట్లకు పైగా షేర్ సాధించడం సాధ్యమే అంటున్నారు.

Also Read: పవన్ దూరం: మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కో బాధ్యత...(పూర్తి డీటేల్స్)

ఈ గణాంకాల నేపథ్యంలో తెలుగులో పలు భారీ బడ్జెట్ చిత్రాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ తో ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. 2017 జనవరిలో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

పవన్-త్రివిక్రమ్

పవన్-త్రివిక్రమ్

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యాక్షన్ కామెడీ ఎంటర్టెనర్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

టాప్ టెక్నీషియన్లు

టాప్ టెక్నీషియన్లు

ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్లు తీసుకునే ఆలోచనలో ఉన్నారని, బహుషా వారు బాలీవుడ్, లేదా కోలీవుడ్ నుండి ఎంపిక చేసే అవకాశం ఉందని టాక్.

భారీగా బడ్జెట్ ఎందుకు?

భారీగా బడ్జెట్ ఎందుకు?

2018 తర్వాత పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అయిపోతారు. అందుకే పొలిటికల్ ఎంట్రీ ముందు తాను చేయబోయే సినిమా భారీగా ఉండాలని, తన కెరీర్లోనే ఓ పెద్ద బిగ్గెస్ట్ హిట్ సినిమా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట.

రూ. 100 కోట్లు

రూ. 100 కోట్లు

త్రివిక్రమ్ ఈ సినిమాను డిపరెంటుగా ప్లాన్ చేస్తున్నారని, అందుకే రూ. 100 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని, పవన్ కళ్యాణ్ హీరో కాబట్టి రిస్క్ తక్కువగా ఉంటుందనే ఆలోచనలో ఈ సాహసం చేయడానికి సిద్దమయ్యారని అంటున్నారు.

పలు రికార్డులు బద్దలు

పలు రికార్డులు బద్దలు

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో భారీ సినిమా వస్తే పలు టాలీవుడ్లో పలు రికార్డులు బద్దలవ్వడం ఖాయం అంటున్నారు.

English summary
Since Pawan Kalyan wants to stop doing movies in 2018 to concentrate on his political career, director Trivikram reportedly wants this movie to be a very special and bigger one. Fans expect it to set new records, so Trivikram is planning in big way with the elements of high-voltage action and comedy. Hence budget will be more than Rs 100 Cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu